కేసీఆర్‌కు కొత్త చిక్కు: రాజీనామా ఆమోదిస్తే రేవంత్ గట్టి షాకివ్వక తప్పదు?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి రాజీనామాపై అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతల్లో చర్చ సాగుతోంది. ఆయన రాజీనామా చేస్తారా? స్పీకర్ ఆమోదిస్తారా అనే ఉత్కంఠ అందరిలో ఉంది.

రేవంత్ రెడ్డి రాజీనామాపై తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు

  బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే | Oneindia Telugu
  రేవంత్ రాజీనామా అందలేదు

  రేవంత్ రాజీనామా అందలేదు

  ఈ నేపథ్యంలో అసెంబ్లీ కార్యదర్శిని ఓ ఇంగ్లీష్ మీడియా అడగగా ఆయన రేవంత్ రాజీనామాపై స్పందించారు. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి రాజీనామా తమకు ఇంకా అందలేదని తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యులు చెప్పారు.

  మద్దతుదారులు ఏం చెబుతున్నారంటే

  మద్దతుదారులు ఏం చెబుతున్నారంటే

  రేవంత్ రెడ్డి ఏపీలో రాజీనామా లేఖను ఇచ్చారు. దానిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు ఫార్వార్డ్ చేయాలి. దానిని ఫార్వార్డ్ చేయకుండే రేవంత్ రెడ్డి మళ్లీ కొత్తగా తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందిస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

  రేవంత్ రాజీనామా ఆమోదిస్తే కొత్త చిక్కులు

  రేవంత్ రాజీనామా ఆమోదిస్తే కొత్త చిక్కులు

  2014 తర్వాత దాదాపు ముప్పై మంది ఎమ్మెల్యేల వరకు ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్‌లో చేరారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా ఆమోదిస్తే అధికార పార్టీకి కొత్త చిక్కులు తప్పకుండా వస్తాయని అంటున్నారు.

  రేవంత్ రాజీనామా ఆమోదిస్తే..

  రేవంత్ రాజీనామా ఆమోదిస్తే..

  రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే, దానిని స్పీకర్ ఆమోదిస్తే ఆయన మరోసారి కేసీఆర్ పైన పోరాటానికి సిద్ధమవుతారని అంటున్నారు. తన రాజీనామా ఆమోదించడాన్ని స్వాగతిస్తూనే టీఆర్ఎస్‌లో చేరిన మిగతా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, వారి రాజీనామాలు ఆమోదించాలని ఆయన, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో, బయట డిమాండ్ చేసే అవకాశముంది.

  అవసరమైతే కోర్టుకు

  అవసరమైతే కోర్టుకు

  తన రాజీనామా ఆమోదించి ఇతరుల రాజీనామాను పెండింగులో పెడితే అవసరమైతే రేవంత్ కోర్టుకు కూడా వెళ్తారని ఆయన అనుచరులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది.

  తలసాని చెబుతున్నంత సులభం కాదు

  తలసాని చెబుతున్నంత సులభం కాదు

  తలసాని చెబుతున్నట్లు తాను రాజీనామా చేశానని, టీడీపీని విలీనం చేశామని అంటున్నారని, కానీ మిగతా వారి పరిస్థితి ఏమిటనే పాయింట్ కూడా వస్తుందని అంటున్నారు. ఏ రకంగా చూసినా కేసీఆర్‌కు తలనొప్పులే అంటున్నారు. తన రాజీనామా ఆమోదిస్తే మిగతా వారి రాజీనామాలపై రేవంత్ పోరాటం ఆగదని చెబుతున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former state TDP working President Revanth Reddy had joined the Congress party earlier this week in New Delhi.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి