సీతక్క టిడిపికి ట్విస్ట్: రేవంత్ సతీమణి ప్లాన్, ఫోన్ స్విచ్ఛాప్ అందుకేనా?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్:ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంలో రేవంత్‌రెడ్డి సతీమణి కీలకపాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది.సీతక్క టిడిపిలోనే కొనసాగుతారనే అందరూ భావించారు. కానీ,, అనుహ్యంగా సీతక్క రేవంత్‌తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే టిఆర్ఎస్‌ నేతలు సీతక్కను సంప్రదించిన మీదట టిడిపిలోనే కొనసాగుతారని ప్రకటించారు. దరిమలా రేవంత్‌రెడ్డి చక్రం తిప్పడంతో సీతక్క అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెబుతున్నారు.

  రేవంత్ రెడ్డి పరిణామంతో ఆయన TRS లోకి, అనుచరుడు కాంగ్రెస్‌లోకి | Oneindia Telugu

  తెలంగాణ రాజకీయాలు: అమిత్‌షా వ్యూహనికి రేవంత్‌రెడ్డి దెబ్బ

  రేవంత్‌రెడ్డితో పాటు కీలకమైన నేతలు టిడిపిని వీడారు. అయితే పార్టీతోనే కొనసాగుతామని ప్రకటిస్తూ వచ్చిన సీతక్క అనుహ్యంగా ఢిల్లీకి వెళ్ళారు. టిడిపికి రాజీనామా చేసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  రేవంత్‌రెడ్డి ఎపిసోడ్: ఆ ముగ్గురిపైనే అందరి దృష్టి

  టిడిపిలో చోటుచేసుకొంటున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ వల వేస్తున్నారు. అయితే సీతక్క విషయంలో కూడ కొందరు అధికార పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారని ప్రచారం సాగుతోంది.

  రేవంత్‌ది మైండ్‌గేమ్: ''ప్రజా బ్యాలెట్ నిర్వహించండి, నవంబర్ 2న, జనరల్‌బాడీ''

   సీతక్క అనుహ్య నిర్ణయం వెనుక రేవంత్ సతీమణి

  సీతక్క అనుహ్య నిర్ణయం వెనుక రేవంత్ సతీమణి

  ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక రేవంత్‌రెడ్డి సతీమణి పాత్ర ఉందనే ప్రచారం సాగుతోంది. టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు చర్చించారని సమాచారం. టిఆర్ఎస్‌లో చేరాలని ఆహ్వనించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఈ తరుణంలో టిఆర్ఎస్‌లో చేరేందుకు ఆమె ఆసక్తి చూపలేదని సమాచారం. ఈ విషయాన్ని దయాకర్‌రావు మీడియాకు చెప్పారు. అయితే ఈ విషయం తెలుసుకొన్న రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగారని అంటున్నారు. రేవంత్‌రెడ్డి సతీమణి రంగంలోకి దిగి సీతక్కను ఒప్పించిందనే ప్రచారం సాగుతోంది. హన్మకొండలోని సీతక్క ఇంటికి రేవంత్‌రెడ్డి సతీమణి వెళ్ళి ఆమెతో చర్చించారని అంటున్నారు. ఆమెను రాత్రికి రాత్రే హైద్రాబాద్‌కు తీసుకురావడంతో సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రచారం సాగుతోంది.

  సీతక్క ఫోన్ స్విచ్చాఫ్ వెనుక కారణమేమిటీ?

  సీతక్క ఫోన్ స్విచ్చాఫ్ వెనుక కారణమేమిటీ?

  గత మూడు రోజులుగా టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో సీతక్క తన సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేయడంతో కార్యకర్తలకు అందుబాటులో లేకుండాపోయారు. సోమవారం స్వగ్రామం ములుగు మండలం జగ్గన్నపేటకు సీతక్క వచ్చి వెళ్లారు. కానీ, కార్యకర్తలను కలవలేదు. స్వంత పని కోసం ఊరికి వచ్చివెళ్ళారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. హన్మకొండలోని తన నివాసానికి సోమవారం నాడే చేరుకొన్నారు. అయితే అర్ధరాత్రి వరకు కూడా సీతక్క అందుబాటులోకి రాకపోవడంతో కార్యకర్తల్లో ఉత్కంఠ రేగింది.రాత్రికి రాత్రే సీతక్క హైద్రాబాద్‌ నుండి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

   సీతక్క రాకను వ్యతిరేకిస్తున్న వీరయ్య

  సీతక్క రాకను వ్యతిరేకిస్తున్న వీరయ్య

  ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఆ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అనుచరులతో కలిసి ములుగులో సమావేశం ఏర్పాటు చేసి అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు సమాయత్తం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.

  1999, 2004లో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వీరయ్య 2009, 2014లో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌‌ను అంటిపెట్టుకుని పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సీతక్క కాంగ్రె్‌సలో చేరడం వీరయ్య వర్గీయులను ఆందోళనకు గురిచేస్తోంది. సీతక్కకు టికెట్‌ ఇస్తే వీరయ్య పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ వీరయ్యకు టికెట్‌ ఇస్తే సీతక్కకు ఏ పదవి ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

  టిఆర్ఎస్‌లో సీతక్క ఎందుకు చేరలేదు

  టిఆర్ఎస్‌లో సీతక్క ఎందుకు చేరలేదు

  ఎర్రబెల్లి దయాకర్‌రావు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలోనే సీతక్క కూడ టిడిపిని వీడి టిఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే సీతక్క టిడిపిలోనే ఉంది. అదే సమయంలో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో రేవంత్‌ను ఆమె అనుసరించింది. ములుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్‌ నుండి మంత్రి చందూలాల్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీతక్క టిఆర్ఎస్‌లో చేరితే చందులాల్‌ను కాదని టిక్కెట్టు ఇవ్వకపోవచ్చంటున్నారు. ఈ పరిస్థితుల్లో టిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ బెటర్ అని భావించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడ వీరయ్య ఉన్నప్పటికీ అతడిని కాదని సీతక్కకు ఎలా టిక్కెట్టు కేటాయిస్తారనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అయితే రేవంత్‌ నుండి హమీ లభించిన మీదటే సీతక్క కాంగ్రెస్ పార్టీలో చేరిందనే ప్రచారం కూడ లేకపోలేదు.

   సీతక్క కాంగ్రెస్‌లో ఉండదన్న ఎర్రబెల్లి

  సీతక్క కాంగ్రెస్‌లో ఉండదన్న ఎర్రబెల్లి

  టిడిపిలో చోటుచేసుకొన్న పరిణామాల నేపథ్యంలో సీతక్క తనతో మాట్లాడిందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించారు. అయితే సీతక్క టిఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్న విషయాన్ని దయాకర్‌రావు ధృవీకరించారు. కార్యకర్తలతో కూడ ఆమె సమావేశాన్ని నిర్వహించాని ఆయన చెప్పారు. అయితే సోమవారం రాత్రి రేవంత్‌రెడ్డి సతీమణి సీతక్కతో చర్చించిన మీదట ఆమె తన నిర్ణయాన్ని మార్చుకొందని దయాకర్‌రావు చెప్పారు.సీతక్క కాంగ్రెస్‌లో ఉండలేదు, బయటకు వస్తోందని దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Former Mulugu MLA seetakka joined in Congress with Revanth Reddy on Tuesday at Delhi. After Revanth reddy's wife discussed with Seetakka, She changed her decission to continue in TDP. Then she decided to join Congress.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి