కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి
అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని ఆరోపించారు. దళిత నాయకుడు స్పీకర్ స్థానంలో ఉన్న కారణంగానే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనే హామీని కేసీఆర్ తుంగలో తొక్కారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్.. తన కేబినెట్ ద్వారా కూడా తనకు ఎస్సీలపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ దళిత వ్యతిరేకి అని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అనే హామీని కేసీఆర్ తుంగలో తొక్కారని అన్నారు. తన కేబినెట్ ద్వారా కూడా తనకు ఎస్సీలపై ఉన్న వ్యతిరేకతను బయటపెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ హయాంలో 2018 తర్వాత కొప్పుల ఈశ్వర్ కు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి, స్పీకర్ వంటి కీలక పదవులిచ్చి గౌరవించామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ మాత్రం భట్టి విక్రమార్కను వ్యక్తిగతంగా అవమానించేలా ప్రవర్తించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. కడియం శ్రీహరి పట్ల కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరును బీఆర్ఎస్ నేతలు సమర్థిస్తారా..? అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి.. చేతితో సైగ చేస్తూ గన్ తో కాలుస్తానని అన్నారని సీఎం ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి అనుచిత ప్రవర్తనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని.. ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి మచ్చలేని నాయకుడు కడియం శ్రీహరి అని అన్నారు. అసెంబ్లీలో సీనియర్ నాయకుల్ని అవమానిస్తే ఉపేక్షించేదని తెలిపారు.












Click it and Unblock the Notifications