వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ నిర్లక్ష్య పాలన: పోరాబాట చేపడ్తామన్న రేవూరి

|
Google Oneindia TeluguNews

వరంగల్: రైతు పోరుబాటకు విశేష స్పందన లభించిన నేపథ్యంలో.. ఆ స్ఫూర్తితో విద్యార్థుల పోరుబాటను చేపట్టనున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై డిసెంబర్ 9న అర్బన్‌ జిల్లా కేంద్రం నుంచి చేపట్టే కార్యక్రమానికి తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డితోపాటు తెలునాడు విద్యార్థి ఫ్రంట్(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) రాష్ట్ర అధ్యకక్షుడు మధుసూదన్‌రెడ్డి, తెలుగు యువత నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని, ఫలితంగా దళిత, నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారని ప్రకాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Revuri Prakash Reddy fires at KCR government

విద్యార్థుల పోరుబాటను ఎక్కడి నుంచి మొదలు పెట్టేది త్వరలోనే ప్రకిస్తామన్నారు.
విద్యార్థుల సమస్యలపై పోరాలు చేస్తున్న ఇతర విద్యార్థి సంఘాలు, సంస్థలను కూడా కలుపుకొని పోతామన్నారు.

విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీనత వైఖరి కారణంగా విద్యార్థులతోపాటు విద్యా సంస్థలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ పోరుబాటలో విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా భాగస్వామ్యం కావాలని ప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.

English summary
Telugudesam Leader Revuri Prakash Reddy on Friday fired at Telangana government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X