రైస్ పుల్లింగ్ పేరుతో వ్యాపారికి రూ. 12 టోకరా: టెక్కీ సహా నలుగురి అరెస్టు
రైస్ పుల్లింగ్ మెటీరియల్ పేరుతో ఓ వ్యాపారిని మోసగించిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరు కూడా ఉన్నాడు.
హైదరాబాద్: రైస్ పుల్లింగ్ యంత్రం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు ముఠా సభ్యులను సికింద్రాబాదులోని కుషాయిగూడ పోలీసులు అరెస్టు చేశారు. మరొకతను పరారీలో ఉన్నాడు. మంగళవారం మల్కాజిగిరి డీసీపీ రమేష్ నాయుడు కేసు వివరాలను వెల్లడించారు.
బాలాపూర్‌కు చెందిన కృష్ణారెడ్డి(34), బేగంపేట మాతాజీనగర్‌కు చెందిన ప్రకాశ్(27), నాచారం మసీద్‌లైనుకు చెందిన రాజేందర్‌చారీ(30), తమిళనాడుకు చెందిన అబ్దుల్ ఖలీల్(37), వెలుకుమార్(35) వ్యాపారిని మోసగించినవారిలో ఉన్నారు. వీరిలో కృష్ణారెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీరు.
వారంతా ఓ ముఠాగా ఏర్పడి రైస్ పుల్లింగ్ రేడియేషన్ ఆర్టికల్‌కు దివ్య శక్తులు ఉన్నాయని, ఇది ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని, తేలికగా డబ్బు సంపాదించవచ్చని నమ్మిం చి ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు కుషాయిగూడకు చెందిన వ్యాపారి శివశంకర్‌ను కలిసి తమ వద్ద రైస్ పుల్లింగ్ యంత్రం ఉన్నదని, ఇది మీవద్ద ఉంటే అంతా మంచే జరుగుతుందని నమ్మించి అతని వద్ద రూ.12 లక్షలు వసూలు చేశారు.

బాధితుడు రైస్ పుల్లింగ్ యంత్రం కోసం పలుమార్లు వారిని సంప్రదించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ వచ్చారు. తమిళనాడులో ఉందని ఒకసారి, మరోసారి మరిన్ని డబ్బులు చెల్లించాలని తెలిపారు. దీంతో బాధితుడు కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో భాగంగా ఎస్‌ఓటీ సీఐ నర్సింగ్‌రావు అధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం తుర్కయాంజాల్‌లో నిందితులు ప్రకాశ్, కృష్ణారెడ్డి, రాజేందర్‌చారీ, వేలు కుమార్‌లను అదుపులోకి తీసు కున్నారు.
వారి వద్ద నుంచి రూ.3.20లక్షల నగదుతోపాటు నకిలీ రైస్ పుల్లింగ్ యంత్రం, ప్లాట్ పేప ర్లు, టార్చిలైట్, క్యాండిల్స్, ఓ కారుతో పాటు మరిని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు అబ్దుల్ ఖలీల్ పరారీలో ఉన్నాడు.












Click it and Unblock the Notifications