అర్థరాత్రి శవాన్ని కాలుస్తూ పట్టుబడిన ఆర్ఎంపీ వైద్యుడు
హైదరాబాద్: అర్థరాత్రి పూట రహస్యంగా మృతదేహాన్ని దహనం చేస్తూ ఓ వ్యక్తి పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం సాతంరాయి గ్రామం రామాలయం వద్ద సబ్‌రోడ్డులో శనివారం అర్థరాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని తీసుకుని వచ్చి నిప్పంటించాడు.
దాంతో చెత్త తగులబడుతుందని స్థానికులు భావించారు. అయితే, సరిగ్గా అదే సమయంలో అటువైపు వచ్చిన గస్తీ పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఆర్ఎంపి వైద్యుడని పోలీసులు గుర్తించారు.

వైద్యం వికటించి మృతి చెందిన రోగి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తన బైక్‌పై తీసుకుని వచ్చి శంషాబాద్‌లో దహనం చేయడానికి పూనుకున్నాడని స్థానికులు అంటున్నారు.
అనారోగ్యంతో విద్యార్థిని ఆత్మహత్య
అనారోగ్య కారణాలతో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని నందివనపర్తి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. నందివనపర్తికి చెందిన గౌర మల్లయ్య రెండో కూతురు అనిత (16), గున్‌గల్‌లోని మోడల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ ఫస్టీయర్ చదువుతుంది. అనార్యోగ సమస్యతో బాధపడుతూ మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications