శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం: లోయలో పడిన వ్యాన్, 9 మంది గల్లంతు
కర్నూలు: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట సమీపంలో సుమారు 50 అడుగుల లోయలో ఓ వ్యాను పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 9 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మలుపులతో ఉండే ఈ ఘాట్ రోడ్డులో గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి.

శ్రీకాళహస్తి ఆలయ ప్రతిష్ట కేసు: అరెస్ట్
శ్రీకాళహస్తి ఆలయంలో కలకలం రేపిన కొత్త విగ్రహాల ప్రతిష్ఠ ఘటన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుత్తూరుకు చెందిన సుధాకర్, తిరుమలయ్య, సూలవర్ధన్ లను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యక్తిగత సమస్యల కారణంగానే ఆలయంలో విగ్రహాలు పెట్టారు. సీసీ ఫుటేజీని కూడా పరిశీలించామని పోలీసులు తెలిపారు. ఆధారాలతోనే నిందితులను పట్టుకున్నామని చెప్పారు. దోష నివారణ కోసం విగ్రహాలు ప్రటిష్టించినట్లుగా విచారణలో నిందితులు తెలిపారు. నిందితుల నుంచి
రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications