Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్కా సినీ ఫక్కీలో..: ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ ఇలా, ఈ వేషాలతో వచ్చారు..

దోపిడీ దొంగలు అచ్చం సినిమాల్లో లాగా వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్‌ను దోచుకుని పారిపోయారు. సంగారెడడి జిల్లాని బీరంగూడలో దిమ్మతిరిగే విధంగా దోపిడీ జరిగింది.

హైదరాబాద్‌: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బీరంగూడలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలో పక్కా సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. సిబిఐ అధికారులమంటూ వచ్చి కేవలం 15 నిమిషాల్లోనే రూ.13 కోట్ల విలువైన 46 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఐదుగురు దోపిడీ దొంగలు వేర్వేరు వేషాల్లో వచ్చారు.

సర్దార్జీ వేషంలో ఒకతను వచ్చాడు. అతను బ్లాక్ సఫారీ డ్రెస్ వేసుకున్నాడు. బూట్లు ధరించి సిబిఐ అధికారిని అని చెప్పుకున్నాడు. కుడి చేతికి బంగారు ఉంగరం ఉంది. అతని వయస్సు 35 నుంచి 40 ఉంటుంది. హిందీ, ఇంగ్లీషు భాషల్లో గుక్క తిప్పుకోకుండా మాట్లాడాడు. చేతిలో పిస్టోల్ ఉంది.

రెండో వ్యక్తి పలుచటి గులబీ రంగు మంకీ క్యాప్ ధరించాడు. అతన్ని దొంగగా చూపించారు. ఇతనే బంగారం దాచి ఉంచే అల్మార్లలోని సొత్తును ఒక చోటికి చేర్చి సంచీలో నింపాడు. మూడో వ్యక్తి ట్రాఫిక్ పోలీసు వేషధారణలో వచ్చాడు. ఇతను తెల్లటి చొక్కా, లైట్ బ్లాక్ ప్యాంట్ ధరించాడు. నాలుగో వ్యక్తి మిలిటరీ క్యాప్ ధరించాడు. తెల్లటి చొక్కను టక్ చేసి ఆఫీసర్‌లా ఉన్నాడు. ఐదో సఫారీ డ్రెస్సులో ఉన్నాడు. ఇతడి వద్ద పిస్తోల్ వంటి ఆయుధం ఉంది.

వారిలా ఇచ్చారు...

వారిలా ఇచ్చారు...

బుధవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో రోజు మాదిరిగానే ముత్తూట్ ఫైనాన్స్‌ను ఎప్పటిలాగే తెరిచారు. సిబ్బందితో బ్రాంచ్‌ మేనేజర్‌ సమావేశమయ్యారు. అంతలోనే బ్లాక్‌ స్కార్పియో రయ్యమంటూ దూసుకొచ్చి కార్యాలయం ముందు ఆగింది. బిలబిలమంటూ ఐదుగురు వ్యక్తులు దిగి లోపలికి ప్రవేశించారు. తమను తాము సీబీఐ అధికారులుగా చెప్పుకొన్నారు.. తమవెంట తీసుకొచ్చిన బేడిలు వేసివున్న ఓ వ్యక్తిని చూపిస్తూ ‘‘ఇతను దొంగ.. చాలా దొంగతనం కేసుల్లో నిందితుడు. ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా మీ బ్రాంచ్‌లో బంగారాన్ని తాకట్టు పెట్టాడు. దీనిపైనే మేం విచారణకు వచ్చాం. లాకర్‌ తాళాలు ఇవ్వండి'' అంటూ హడావిడి చేశారు. సిబ్బందిని పిస్టోల్‌తో బెదిరించారు.

సిబ్బందిని ఇలా బెదిరించారు...

సిబ్బందిని ఇలా బెదిరించారు...


సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య కథనం ప్రకారం... సిబ్బంది సమావేశంలో ఉండగా ఐదుగరు వ్యక్తులు సీబీఐ అధికారులమంటూ లోనికి వచ్చారు. ఒకరు సర్దార్జీ వేశంలో ఉండగా, ఇద్దరు సఫారీ దుస్తులు, మరొకరు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ దుస్తులు ధరించిన. మరో వ్యక్తికి మంకీ క్యాప్‌ వేయడంతో పాటు చేతులకు బేడీలు వేసి లోనికి తీసుకువచ్చారు. మంకీ క్యాప్ పెట్టుకుని, బేడీలు ధరించిన వ్యక్తిని నిందితుడిగా చూపుతూ, బంగారం తాకట్టు పెట్టిన వారి వివరాలు, స్ట్రాంగ్ రూం తాళాలు ఇవ్వాలంటూ ఓ ఉద్యోగిని తుపాకీతో బెది రించారు. దీంతో సదరు ఉద్యోగి స్ట్రాంగ్ రూం తాళాలు తెరవడంతో వెంట తెచ్చుకున్న 3 బ్యాగుల్లో సుమారు 40 కిలోల బంగారు ఆభరణాలు, మరో రూ.లక్షను సర్దుకున్నారు. అనంతరం సిబ్బందిని బాత్‌రూంలోకి నెట్టి బయట నుంచి గడియవేశారు.

పటాన్‌చెర్వు వైపు పారిపోయారు.

పటాన్‌చెర్వు వైపు పారిపోయారు.

దోపిడీ దొంగలు బ్లాక్‌ స్కార్పి యో వాహనంలో పటాన్‌చెరు వైపు వెళ్లారని, వారిని పట్టుకోవడానికి 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని శాండిల్య చెప్పారు. దోపిడీ ముఠా సభ్యులు హిందీలో మాట్లాడటాన్ని బట్టి ఈ పని అంతర్రాష్ట్ర ముఠాదేనని అనుమానిస్తున్నారు. చోరీ వెనుక సిబ్బంది హస్తం ఉన్నట్లుగానూ అనుమానిస్తున్నారు. అయితే దొంగలు లాకర్లలోని రెండు మూడు కేజీల మేర బంగారాన్ని వదిలివేశారని తెలిసింది. మరోవైపు ఈ దోపిడీ ముఠా కర్ణాటకలోని గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించామని ఓ పోలీసు అధికారి తెలిపారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

న్యాయం చేస్తాం...

న్యాయం చేస్తాం...

ముత్తూట్‌ ఫైనాన్స్‌లో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారులకు న్యాయం చేస్తామని సంస్థ అధికారులు తెలిపారు. తమ సంస్థలో ఉన్న ప్రతి గ్రాముకి బీమా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా 4,500 బ్రాంచీలున్నాయని తెలిపారు. దోపిడీ జరిగిన కొద్దిసేపటికి తేరుకున్న సిబ్బంది రామచంద్రాపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, జిల్లా ఎస్‌పి చంద్రశేఖర్‌రెడ్డి, అడిషనల్ ఎస్‌పిలు కార్యాలయాన్ని తనిఖీ చేశారు.

సీసి టీవి రికార్డులను, హార్డ్ డిస్క్ తీసుకెల్లారు.

సీసి టీవి రికార్డులను, హార్డ్ డిస్క్ తీసుకెల్లారు.

పారిపోవడానికి ముందు దొంగలు సిసి టీవీ రికార్డులను, హార్డ్ డిస్క్‌ను తమతో తీసుకెళ్లారని పోలీసులు చెప్పారు. తెలంగాణతో కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. దోపిడీ వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో ఖాతాదారులు ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం వద్దకు చేరుకుని తమ బంగారాన్ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు మూడేళ్ల క్రితం కూడా ఇదే ప్రాంతంలో ఇదే సంస్థకు చెందిన మరో విభాగంలో ఇలాంటి దోపిడీయే జరిగిందని పోలీసులు చెప్పారు.

వారిలా అడిగారు...

వారిలా అడిగారు...

దోపిడీకి వచ్చిన దుండగులు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సిబ్బంది దాదాపు ఐదుారు నిమిషాలు హిందీ, ఇంగ్లీషు భాషల్లో మాట్లాడారు. సిబ్బందిని వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు అడిగారు. ఎవరేం చేస్తారో అడిగి తెలుసుకున్నారు.

బ్యాగ్ నిండిన తర్వాత..

బ్యాగ్ నిండిన తర్వాత..

బంగారాన్ని దోపిడీ దొంగలు పూర్తిగా సంచీలో నింపారు. అది నిండిన తర్వాత ఓ వ్యక్తి వెల్లి వాహనం నుంచి దుప్పటి తెచ్చాడు. అందులో కొంత మూట కట్టారు. పరారయ్యే ముందు సిబ్బందిని బాత్రూంలో బంధించిన బయటి నుంచి గడియపెట్టారు. కాసేపటి తర్వాత ఫైనాన్స్‌కు వచ్చి ఓ ఖాతాదారుడికి బాత్రూం నుంచి అరుపులు వినిపించాయి. దీంతో అతను గడియ తీశాడు.

గుల్బర్గాకు వెళ్లినట్లు గుర్తించారు.

గుల్బర్గాకు వెళ్లినట్లు గుర్తించారు.

ముత్తూట్ ఫైనాన్స్‌ను దోచుకున్న ముఛా కర్ణాటకలోని గుల్బర్గాకు వెళ్లిన పోలీసులు అనుమానిస్తున్నారు. ముఠా ప్రయాణించిన వాహనం నెంబర్ ఎపి 28 ఎన్3107. ఇది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం షాయిగుడాకు చెందిన తిరముల్ రెడ్డికి చెందిన మోటార్ సైకిల్ నెంబర్ అని తేలింది. ఐదుగురు ముఠా సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+