పట్టపగలు జూబ్లీహిల్స్‌లో దోపిడీ: బైక్ ఎత్తుకుని పరారీ
Recommended Video

పట్టపగలు జూబ్లీహిల్స్‌లో దోపిడీ: బైక్ ఎత్తుకుని పరారీ
హైదరాబాద్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో పట్టపగలు దారి దోపిడీ జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 47లోని ఓ కంపెనీలో పని చేసే ఓ ఉద్యోగిపై నడిరోడ్డుపై కాపుగాసిన దుండగులు దాడి చేశారు.
ఆఫీసు నుంచి బయటికి రాగానే అతనిపై ముగ్గురు దుండగులు కత్తులతో బెదిరించి అతని నుంచి పర్సు, ఎఫ్‌జడ్ బండి లాక్కొని పరారయ్యారు. వారిని ఎదుర్కునే క్రమంలో బైక్ నుంచి బాధితుడు పడిపోయాడు.

అయితే ఈ దృశ్యాలన్నీ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ ఘటనకు అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద పోలీసులు అలర్ట్ అయ్యారు.
అయితే బాధితులకు తెలిసిన వారే ఈ ఘటనకు పాల్పడ్డారా? లేకుంటే దొంగలు ఈ పని చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు హైదరాబాదీయులా, లేక అంతరాష్ట్ర ముఠాకు చెందినవారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే రోడ్డుపై ఆ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications