రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో
హైదరాబాద్: అవినీతి నిరోధక శాఖ(ACB) వలలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఏకంగా రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట తహశీల్దార్ తోడేటి సత్యనారాయణ అవినీతి శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. గచ్చిబౌలిలో ఉంటున్న రామశేషగిరిరావు చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసేందుకు, అనుకూలంగా కలెక్టర్‌కు నివేదిక పంపేందుకు ఎమ్మార్వో సత్యనారాయణ.. రామశేషగిరిరావు నుంచి రూ.10లక్షలు లంచం డిమాండ్ చేశాడు.
వివరాల్లోకి వెళితే.. శామీర్‌పేట మండలంలోని లాల్‌గాడి మలక్‌పేట గ్రామ పరిధిలో గుంటూరు జిల్లా వాసి మొవ్వ రామశేషగిరిరావు 2006లో 39 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అనంతరం 10 ఎకరాలు భాగస్వామికి అమ్మగా తనకు 29 ఎకరాలు ఉన్నట్లు తెలిపారు. తన భూమిని ధరణిలో(Dharani) అప్‌లోడ్ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వడానికి తహసీల్దార్ సత్యనారాయణ రూ.40 లక్షలు డిమాండ్ చేసినట్లు బాధితుడు శేషగిరిరావు తెలిపారు.

ముందు పది లక్షల రూపాయలు అడిగారు. ఆ మొత్తాన్ని ఇచ్చాను. ఏడాది నుంచి తిప్పుతున్నారు కానీ పని కావటం లేదు. కాగా ఇంకా రూ.30 లక్షలు డిమాండ్ చేశారని మొవ్వ శేషగిరిరావు వాపోయారు. 2009లో రూ.20 లక్షల చెక్కును ఓ హోటల్లో ఇచ్చినా.. ధరణిలో అప్‌లోడ్ చేయకుండా జేబులో పెట్టుకుని, మరో రూ.20 లక్షలు డిమాండ్ చేశారన్నారు. డబ్బులు తీసుకొని కూడా పని చేయకపోవడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు.
ఏసీబీ అధికారుల సూచనతో బాధితుడు తహశీల్దార్ డ్రైవర్ బద్రీకి లంచం ఇస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతణ్ని విచారించగా, తహశీల్దార్ ఆదేశాల మేరకే డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీబీ డీఎస్పీ మాట్లాడుతూ.. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కరీంనగర్, హైదరాబాద్ నగరంలోని తహసీల్దార్ అక్రమాస్తులపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలిపారు.
ఇది ఇలావుండగా, మరోచోట ఏసీబీ వలలో ఇన్‌చార్జి సబ్‌రిజిస్టార్‌తో పాటు మరో ప్రైవేట్ వ్యక్తి చిక్కుకున్నారు. దూద్‌బౌలి సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ అమీర్ ఫరాజ్ ప్రస్తుతం ఇంఛార్జి సబ్‌రిజిస్టార్‌గా వ్యవహరిస్తున్నారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం ఓ వ్యక్తి వద్ద రూ.2 లక్షలను అమీర్ డిమాండ్ చేశాడు. ఆ లంచం సొమ్మును గోపీ సింగ్ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. వీరిద్దరినీ ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కాగా, ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications