వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతుబంధు విడుదల: 59 లక్షల మంది రైతులకు..రూ.14 వేల 600 కోట్లు రిలీజ్

|
Google Oneindia TeluguNews

రబీ సీజన్ కోస రైతు బంధును ప్రభుత్వం విడుదల చేసింది. 59 లక్షల మంది రైతుల కోసం రూ.14 వేల 600 కోట్లు రిలీజ్ చేసింది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు సమస్యలను పరిష్కించాలనే అలోచతో రైతు వేదికలు ఏర్పాటు చేశామ‌న్నారు. శ‌నివారం మహబూబాబాద్ జిల్లాలో మీడియాతో మంత్రి సత్యవతి రాథొడ్‌తో కలిసి మాట్లాడారు. రైతులకు అండగా నిలిచే ప్రభుత్వం తమదని తెలిపారు.

Recommended Video

Rythu Bandhu: Rythu Bandhu released For 59 lakh farmers | Oneindia telugu

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 82 రైతు వేదికల పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా‌ సర్పంచ్‌ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లాకు మరిన్ని రైతు వేదికలు మంజూరు చేస్తామ‌ని చెప్పారు. పోడు భూముల సాగుచేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇస్తామ‌ని చెప్పారు. తెలంగాణ ఏర్పడకముందు ఎక్కడ చూసిన భూములు మొత్తం ఎడారి గా వుండేవ‌ని చెప్పారు. కానీ ఇప్పుడు పంటలతో కళకళ లాడుతున్నాయని తెలిపారు.

rs 14600 crore is being released to 59 lakh farmers under the rythu bandhu

రాష్ట్రం రోజు రోజుకీ అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వలసలు అరికట్టామ‌ని అన్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు 59 లక్షల మంది రైతులకు రైతు బంధు కింద 14.600 కోట్లు విడుదల చేస్తున్నామ‌ని మంత్రి తెలిపారు. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. కొత్త చట్టాలతో తమకు అన్యాయం జరుగుతోందని తెలిపారు.

English summary
rs 14600 crore is being released to 59 lakh farmers under the rythu bandhu telangana minister niranjan reddy said
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X