నయీం ఆస్తుల విలువ 2 వేల కోట్లు, తేల్చిన సిట్ అధికారులు
ఎన్‌కౌంటర్ లో హతమైన నయీం ఆస్తుల విలువను సీట్ లెక్క తేల్చింది. నయీం కు మొత్తం 1019 ఎకరాల భూములు , 29 కేజీల బంగారం, రూ. 2 కోట్ల నగదు ఉన్నట్టు సీట్ పేర్కోన్నట్టు ఓ తెలుగు ప్రైవేట్ చానల్ కథనాన్ని ప్రసారం చేసింది. కాగా నయీం ఆస్తుల మొత్తం విలువ రెండు వేల కోట్లు ఉంటుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వెల్లడించిందని తెలిపింది.
కాగా నయిం బాధితుల్లో చాల మంది పెద్ద తలకాయాలు ఉన్నాయని ఆయన వెనుక చాల మంది రాజకీయ నాయకులు కూడ ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈనేపథ్యంలనే 2008 ఆగస్ట్ లో మహబుబ్ నగర్ లోని షాద్ నగర్ వద్ద ఉన్న మిలీనియం టౌన్‌షిప్ లో ఉన్న నయిం పోలీస్ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. ఆయన వెనక పెద్ద రాజకీయా నాయకులు ఉండడంతో పాటు పలువురు భాదితులు కూడ ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే నయిం ఆస్తుల వివరాలను సిట్ వెల్లడించింది.













Click it and Unblock the Notifications