భారీ స్కాం: గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల రూ.5కోట్ల సొమ్ము మాయం
రంగారెడ్డి: జిల్లాలోని మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల్లో నుంచి నగదు మాయమైంది.
సుమారు యాభై మంది ఖాతాదారులకు చెందిన రూ.5కోట్లు గల్లంతైనట్లు సిబ్బంది గుర్తించారు. ఈ విషయం తెలిసిన బాధిత ఖాతాదారులు బ్యాంక్ వద్ద ఆందోళన చేశారు.

ప్రస్తుతం బ్యాంక్‌లో శాఖపరమైన ఆడిటింగ్ జరుగుతుండగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్‌లో జరిగిన అవకతవకలపై బాధ్యులను గుర్తించేందుకు శాఖపరమైన విచారణ ప్రారంభించారు.
మరోవైపు పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేసిన జైపాల్‌రెడ్డిని ప్రధాన నిందితునిగా పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెప్పారు.












Click it and Unblock the Notifications