Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో భారీ విమానాశ్రయం- భూసేకరణకు నిధులు మంజూరు

తెలంగాణలో మరో భారీ ఎయిర్ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. దీనికి సంబంధించి నిధులు సైతం విడుదల అయ్యాయి. విమానాశ్రయం భూసేకరణ పనులకు ఉద్దేశించిన నిధులు ఇవి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ధీటుగా, అత్యాధునిక సౌకర్యాలతో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఇది అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపర్చినట్టవుతుంది.

వరంగల్ సమీపంలోని మామునూర్ వద్ద ఈ విమానాశ్రయం నిర్మితం కానుంది. దీనికి అవసరమైన భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 90 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు- భవనాలు (విమానాశ్రయాలు) మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Rs 90 Crore Boost for Mamnoor Airport Land Acquisition Gets Green Light

గత ఏడాది నవంబర్ 11వ తేదీన మంజూరు చేసిన 205 కోట్ల రూపాయలకు ఇవి అదనపు నిధులు. విమానాశ్రయ నిర్మాణం, అభివృద్ధి కోసం 280 ఎకరాల 30 గుంటల భూమిని సేకరించే బాధ్యతను గతంలోనే వరంగల్ జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే ఆర్థిక శాఖ భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో 90 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో భూసేకరణ పనులు మరింత ముమ్మరం కానున్నాయి.

భూసేకరణ కోసం ఇప్పటివరకు మొత్తం 295 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్టయింది. భూమిని కోల్పోయే రైతులు, యజమానులకు నష్టపరిహారాన్ని ఈ మొత్తంలో నుంచి చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఈ మొత్తాన్ని వరంగల్ రెవెన్యూ డివిజనల్ అధికారికి బదలాయించాల్సి ఉంటుంది. వరంగల్ లో ఎయిర్ పోర్ట్ ను నిర్మించాలంటూ గతంలోనే ఎయిర్ పోర్ట్ అథారిటీ లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయకూడదనే ఎక్స్‌క్లూజివిటీ క్లాజ్ ఉండటం వల్ల అనుమతులు లభించడంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీన్ని నివారించడానికి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (HIAL) నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ సైతం పొందింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రతిపాదనలపై ఏఏఐ అమోదం తెలిపింది.

పెద్దాపల్లి జిల్లాలోని అంతర్గాంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి కన్సల్టెన్సీ ఫీజుల చెల్లింపునకు ప్రభుత్వం పాలనాపరమైన ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికోసం 40.43 లక్షల రూపాయల మొత్తాన్ని విడుదల చేసింది. రాష్ట్రంలో ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని కోసం టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్ ను తయారు చేయడానికి ఎయిర్ పోర్ట్ అథారిటీని కన్సల్టెంట్‌గా నియమించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+