వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

RS Praveen: ఫోన్లను హ్యాక్ చేయడం క్షమించరాని నేరం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

|
Google Oneindia TeluguNews

తన ఐ ఫోన్‌ను ప్రభుత్వం హ్యాక్ చేస్తోందంటూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించిన విషయం తెలిసిందే. ఆయన తాజాగా మరో ఆరోపణ చేశారు. తెలంగాణకు చెందిన మరో ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ వాడే ఆపిల్ ఐఫోన్ ను హ్యాక్ చేస్తున్నారంటూ రెండుసార్లు బెదిరింపు నోటిఫికేషన్ వచ్చాయన్నారు, ఈ విషయాన్ని తనతో అతను పంచుకున్నట్లుగా ప్రవీణ్ కుమార్ ట్వీట్ లో పేర్కొన్నారు.

యాపిల్ నుంచి అలర్ట్

యాపిల్ నుంచి అలర్ట్

రెండు రోజుల క్రితం తనకు యాపిల్ నుంచి అలర్ట్ వచ్చిందని ప్రవీణ్ కుమార్ చెప్పారు. తన ఫోన్ హ్యాక్ అవుతోందంటూ.. యాపిల్ సంస్థ నుంచి మెయిల్ వచ్చిందని వెల్లడించారు. వచ్చిన మెయిల్ ను స్క్రీన్ షార్ట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ కూడా చేశారు. "ప్రభుత్వాలు నా ఆ ఫోన్ ను హ్యాక్ (Hack) చేస్తున్నాయి,జాగ్రత్తగా ఉండమని Apple నన్ను హెచ్చరించింది. మీ లాగా నేను నా ఫోన్ ను ధ్వంసం చేయను.😊కానీ మీ దోపిడి-చీకటి సామ్రాజ్యాలను ధ్వంసం చేసి, మా మహనీయులు కలలు కన్న బహుజన రాజ్యాన్ని నిర్మిస్తా👊" అని ట్వీట్ చేశారు.

హ్యాకర్లను శిక్షించండి

హ్యాకర్లను శిక్షించండి

తాజాగా చేసిన ట్వీట్ లో "#తెలంగాణకు చెందిన మరో ప్రముఖ పోల్ స్ట్రాటజిస్ట్ తనకు కూడా రెండుసార్లు బెదిరింపు నోటిఫికేషన్ వచ్చిందని నాతో పంచుకున్నారు.ఆపిల్ తన #iPhoneని రాష్ట్రం టార్గెట్ చేస్తుందని. ప్రజల సొమ్ముతో చట్టాన్ని గౌరవించే పౌరుల ఫోన్‌లను హ్యాక్ చేయడం క్షమించరాని నేరం. #స్టేట్ హ్యాకర్లను శిక్షించండి" అని పోస్ట్ చేశారు.

బహుజన రాజ్యాధికార యాత్ర

ఫోన్ హ్యాకింగ్ పై సుప్రీం కోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్​ చేశారు. ఆర్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బహుజన రాజ్యాధికార యాత్ర చేస్తున్నారు.

English summary
RS Praveen Kumar said that there was an alert that Apple iPhone was being hacked by a famous poll strategist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X