వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌భవన్‌ ‘కోర్టు’కు ఆర్టీసీ సమ్మె.. గవర్నర్ తమిళి సై నిర్ణయంపైనే ఉత్కంఠ

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉదృతం అవుతోంది. సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మెలో పాల్గొంటున్న కార్మికుల ఉద్యోగాలను తొలగిస్తామని చేసిన ప్రకటనతో ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత పెరిగింది. ఇప్పటికే మనస్థాపం చెందిన ఆర్టీసీ కార్మికులు పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. మరి కొందరు ఆత్మహత్య యత్నం చేసి ఆసుపత్రుల పాలయ్యారు. ఇంకొందరు గుండెపోటుతో మృతి చెందారు. అయినప్పటికీ తెలంగాణ సర్కార్ స్పందించిన దాఖలాలు లేవు. దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ సమస్యకు పరిష్కారం చూపాలని, తక్షణమే స్పందించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై కి విన్నవించుకున్నారు.

సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్సమ్మె ఎఫెక్ట్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి సీపీఐ షాక్

గవర్నర్ ను కలిసిన ఆర్టీసీ కార్మిక జేఏసీ

గవర్నర్ ను కలిసిన ఆర్టీసీ కార్మిక జేఏసీ


నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ గవర్నర్ తమిళిసై ని కలిశారు. తమ సమస్యలు పరిష్కరించటానికి చొరవ చూపాలని వినతి పత్రాన్ని ఆమెకు అందించారు. తాము న్యాయపరమైన డిమాండ్లతోనే ఈ సమ్మె ప్రారంభించామని, కానీ తమ సమస్యలను పరిష్కరించకుండా సీఎం కెసిఆర్ తన మొండి వైఖరితో తమ జీవితాలని నాశనం చేస్తున్నాడని గవర్నర్ కు చెప్పుకున్నారు. ప్రభుత్వానికి మీ వంతు సలహాలు ఇవ్వాలని ఆర్టీసీ కార్మికులు తెలంగాణ గవర్నర్ తమిళిసై కి మొరపెట్టుకున్నారు.

గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన జేఏసీ

గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరిన జేఏసీ

టిఎస్‌ఆర్‌టిసి సమస్యపై జోక్యం చేసుకోవాలని, కార్పొరేషన్‌ను ప్రభుత్వంతో విలీనం చేయడం సహా అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని టిఎస్‌ఆర్‌టిసి జెఎసి సోమవారం గవర్నర్ తమిళిసై సౌందరాజన్‌ను కోరారు. అశ్వత్థామ రెడ్డి నేతృత్వంలోని టిఎస్‌ఆర్‌టిసి జెఎసి నాయకులు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలుసుకుని కార్పొరేషన్‌లో కొనసాగుతున్న సమ్మె గురించి వివరించారు. తమ చట్టబద్ధమైన డిమాండ్లతో అక్టోబర్ 5 నుండి కార్మికులు సమ్మెలో ఉన్నారని చెప్పారు.

వేతన ఒప్పందాన్ని అమలు చెయ్యలేదని గవర్నర్ కు తెలిపిన జేఏసీ

వేతన ఒప్పందాన్ని అమలు చెయ్యలేదని గవర్నర్ కు తెలిపిన జేఏసీ

ఏప్రిల్ 1, 2017 న కుదిరిన వేతన ఒప్పందాన్ని ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని వారు గవర్నర్‌కు తెలియజేశారు. చాలా సమయం గడిచినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం పే రివిజన్‌కు సంబంధించి ఎటువంటి చర్యలను ప్రారంభించలేదని జెఎసి నాయకులు తెలిపారు. జూలై 25, 2018 న ప్రభుత్వం తొమ్మిది మంది నిపుణులతో నిపుణుల కమిటీని నియమించిందని నాయకులు పేర్కొన్నారు . కమిటీ నివేదిక సమర్పణకు సిద్ధంగా ఉంది కాని నివేదిక తీసుకోవడానికి ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని యూనియన్ నాయకులు పేర్కొన్నారు.

బకాయిలు , సిబ్బంది వైద్య సేవలు నిలిపివేత సమస్యల ఏకరువు

బకాయిలు , సిబ్బంది వైద్య సేవలు నిలిపివేత సమస్యల ఏకరువు

కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన బకాయిల గురించి వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్మికులు స్వయంగా తొలగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినందున పలువురు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని యూనియన్ నాయకులు తెలిపారు. సిబ్బందికి వైద్య సేవలను యాజమాన్యం నిలిపివేసిందని కార్మికులు ఆరోపించారు. గవర్నర్ జోక్యం చేసుకుని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలని వారు కోరారు.

తెలంగాణా ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు

తెలంగాణా ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కు ఫిర్యాదు

ఎలాగైనా తమకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారుఆర్టీసీ కార్మికులు . ముఖ్యంగా కార్మికులు ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకుంటే బాగుంటుందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. అయితే తెలంగాణలోని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆర్టీసీ కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం చలించటం లేదని వారు తమిళి సై కి విన్నమించారు.

సీఎం నిర్ణయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన

సీఎం నిర్ణయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన

కెసిఆర్ ప్రవర్తనతో విసుగెత్తిన కార్మికులు ఆత్మహత్యాయత్నం కూడా చేశారని, కొందరు ప్రాణాలు కోల్పోయారని ప్రస్తుత పరిస్థితిని గవర్నర్ కు తెలిపారు. కెసిఆర్ తన పంతంతో చాలా మంది ఉద్యోగాలు తొలగించారని వివరించారు. అయితే ఆర్టీసీ కార్మికుల సమస్యలను విన్న తమిళసై న్యాయం జరిగేలా చూస్తానని ఆర్టీసీ కార్మికులతో తెలిపారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంపై గవర్నర్ తమిళిసై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది.

స్పందించిన గవర్నర్ .. ప్రభుత్వ నివేదిక కోరే ఛాన్స్

స్పందించిన గవర్నర్ .. ప్రభుత్వ నివేదిక కోరే ఛాన్స్

ఇప్పుడు కార్మిక సంఘాల నేతలు గవర్నర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడంతో గవర్నర్ తమిళిసై ప్రభుత్వం నిర్ణయంపై నివేదిక కోరే అవకాశం కనిపిస్తుంది. ఇక అదే గనుక జరిగితే తాజా పరిణామాలు అన్నింటిని రిపోర్టు రూపంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి. ఇక ఆ సమయంలో కార్మికుల విషయంలో సెల్ఫ్ డిస్మిస్ లాంటి విషయాన్ని ప్రస్తావించడం కుదరదు. మరి అలాంటప్పుడు ప్రభుత్వం గవర్నర్ కు ఆర్టీసీ సమ్మె విషయంలో ఏ విధంగా రిపోర్ట్ ఇస్తుంది అన్నది ఆసక్తికరమే. గవర్నర్ తమిళి సై ఏం నిర్ణయం తీసుకుంటారనేది కూడా ప్రస్తుతానికి ఆసక్తికరంగానే మారింది.

English summary
TSRTC JAC on Monday urged the Governor Tamilisai Soundararajan to intervene in the TSRTC issue and direct the government to settle all the issues including merger of Corporation with government. The TSRTC JAC leaders led by E Ashwathama Reddy met Governor Tamilisai Soundararajan and informed about the ongoing strike in the Corporation. The JAC leader said that workers were on strike since October 5 with their legitimate demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X