ఉచిత బస్సు ప్రయాణ భారం మోస్తున్న డ్రైవర్ లపై ఆర్టీసీ మరో కఠిన నిర్ణయం!

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు అవుతుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలు జీరో టికెట్ మీద బస్సులలో ప్రయాణాలు చేస్తున్నారు. ఇక మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు నుండి తెలంగాణ ఆర్టీసీ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.

ఇటీవల ఆర్టీసీ కీలక నిర్ణయాలు
అదనపు బస్సులను కొనుగోలు చేయడం, ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, అవసరాన్ని బట్టి బస్టాండుల సంఖ్యను పెంచడం, ఆర్టీసీలో అదనపు డ్రైవర్లను నియమించడం వంటి అనేక చర్యలను చేపడుతుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థికంగా పురోగమిస్తున్న కారణంగా ఆర్టీసీ తీసుకుంటున్న నిర్ణయాలపైన అందరి దృష్టి నెలకొంటుంది.

RTC takes another tough decision on drivers who are carrying the burden of free bus travel

Take a Poll

దానిని నిషేధిస్తూ ఆర్టీసీ కీలక నిర్ణయం
ఇదిలా ఉంటే ఇప్పటికే మహిళల ఉచిత బస్సు ప్రయాణంతో గతం కంటే ఎక్కువ భారాన్ని మోస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు, తాజాగా ఆర్టీసీ తీసుకున్న నిర్ణయంతో ఇంకాస్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు డ్యూటీలో ఉండగా మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధిస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

డ్రైవర్ లు డ్యూటీకి ముందు ఈ పని చెయ్యాల్సిందే
ముఖ్యంగా డ్రైవర్లు మొబైల్ ఫోన్స్ వాడటం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి మొబైల్ ఫోన్స్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూ విధులు నిర్వహించడం చేయకుండా ఫోన్లను డిపోలో డిపాజిట్ చేసి డ్యూటీ ముగిసిన తర్వాత తిరిగి ఫోన్లను తీసుకోవలసి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 11 రీజియన్ లలో ఒక్కో డిపోను సెలెక్ట్ చేసి ప్రయోగాత్మకంగా అక్కడ అమలు చేయనుంది.

డ్రైవర్ ల కోసం ప్రత్యేక కౌంటర్లు
కరీంనగర్ రీజియన్ లోని జగిత్యాల డిపోలో ప్రస్తుతం ఈ నిషేధం అమలు అవుతుంది. జగిత్యాల డిపోలో సెప్టెంబరు ఒకటి నుంచి ఫోన్ నిషేధం అమలు చేస్తున్నారు అధికారులు. డ్రైవర్లు తమ ఫోన్లను డిపోలో డిపాజిట్ చేయడానికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలంటే బస్టాండ్ కు వచ్చిన తర్వాత కంట్రోల్ రూమ్ నుండి కాల్ చేసుకోవచ్చు.

అలా చేస్తే డ్రైవర్ పైనే కాదు కండక్టర్ పైనా చర్యలు
మొత్తం జగిత్యాల డిపోలో 115 బస్సులు ఉండగా, 265 మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. వీరంతా మొబైల్ ఫోన్స్ లేకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక డ్రైవర్లు ఫోన్ వాడకుండా నిఘా ఉంచడం కోసం అధికారులు కండక్టర్లకు కూడా బాధ్యత అప్పజెప్పారు. డ్రైవర్ ఫోన్లో మాట్లాడితే కచ్చితంగా తెలియజేయాలని, ప్రయాణికుల నుంచి ఫిర్యాదు వస్తే డ్రైవర్ పైన మాత్రమే కాదు కండక్టర్ పైన కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

రీజియన్ ల వారీగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలు
ఇక ఈ నిషేధాన్ని పక్కాగా అమలు చేయడం కోసం రీజియన్ ల వారీగా ప్రత్యేక విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. గత నెలలో ఒకటవ తేదీ నుండి ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ విధానం మంచి ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా దీనిని అమలు చేయడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+