రైతు భరోసాపై రేవంత్ సర్కార్ శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో దూకుడు చూపించిన కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు దక్కించుకొని, రాష్ట్రవ్యాప్తంగా తిరిగి తన పట్టును నిలుపుకోవడం తో ప్రస్తుతం ఉత్సాహంగా ఉంది. ఇదే ఉత్సాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది.
రైతు భరోసాపై కీలక అప్డేట్
రైతులు ప్రభుత్వం వ్యవసాయ పెట్టుబడి కోసం ఇస్తున్న నిధుల కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో త్వరలోనే రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. యాసంగి సీజన్ కు పెట్టుబడి సాయంగా రైతు భరోసా కింద ఎకరానికి 6000 రూపాయలు చొప్పున నిధులు అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేయనున్నారు.

ఫిబ్రవరి 17న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో
త్వరలోనే మరో రెండు రోజుల్లోనే ఈ నిధులు విడుదల కానున్నాయని సమాచారం. ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల ముందు నిధుల విడుదలను ప్రభుత్వం ప్రణాళిక చేసినప్పటికీ, కొన్ని కారణాలతో అది ఆలస్యమైంది. ఇప్పటికే దీనికోసం సుమారు తొమ్మిది వేల కోట్లను ప్రభుత్వం సమీకరించింది.
ఎన్నికల విజయంతో జోష్ లో అధికార కాంగ్రెస్
ఇటీవల రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో నిర్వహించిన సభలో ఈ విడుదల పైన క్లారిటీ కూడా ఇచ్చారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత రైతుల ఖాతాలలో ఈ నిధులను జమ చేస్తామని ఆయన సభా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోని తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ విజయోత్సాహంతో ఉంది.
ఈ ఉత్సాహంలోనే రైతు భరోసా నిధుల విడుదలకు కసరత్తు
ఈ ఉత్సాహం లోనే ఫిబ్రవరి 17వ తేదీన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయం పైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయడానికి కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ త్వరలోనే ఓ తీపి కబురు రైతులకు చెప్పబోతోంది అన్నది ప్రధానమైన విషయం.












Click it and Unblock the Notifications