నాగ సాధువులు: నానో టెక్నాలజీ

హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు నాగ సాధువులు, నానో టెక్నాలజీ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఫొటోలు, రైటప్ సందడి సృష్టిస్తోంది. ఈ నెల 17వ తేదీ ఉదయం 12 గంటల ప్రాంతంలో పోస్టు చేసిన ఆ వ్యాసానికి గురువారం మధ్యాహ్నానికి 3 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. నాలుగు వేల మందికి పైగా దాన్ని షేర్ చేశారు. ఆ వ్యాసంలో వెలిబుచ్చిన అభిప్రాయాలు ఏ మేరకు వాస్తవం, ఏ మేరకు కాదు అనే విషయాన్ని పక్కన పెడితే అది మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిది. ఆ వ్యాసం ఇలా ఉంది చదవండి...

ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. దురదృష్టం ఏమిటీ అంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాలనాడే మన దేశంలో వుంది. ఇప్పటికీ వుంది. హిమాలయాల్లో సజీవంగా వుంది. వివరాల్లోకి వెళ్తే....

మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ళ క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మనం పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడవుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగాలేరు.

Sadiq Ali posts Naga Sadhus and Nano Technology

మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు, మాన సంరక్షణ కోసం తను శ్రీ కృష్ణుడిని ప్రార్ధిస్తుంది. ఎక్కడో ద్వారకలో వున్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి ఆటను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టేక్నాలజీయే. త్రిలోక సంచారి ఐన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించే వాడు. ఇదంతా చదివి సాదిక్ భాయ్ కి మతి భ్రమించి రాస్తున్నాడు, అని మిత్రులు భ్రమపడే అవకాశం వుంది. అందుకే, ఇక్కడ ఒక సజీవ ఉదాహరణ ఇస్తున్నాను.

హరిద్వార్ లోనూ, త్రివేణి సంగమం లోనూ జరిగే కుంభమేళా లు గుర్తున్నాయి కదా. అక్కడికి లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల్ల, పేపర్ లలో చూశాం. నాగ సాధువులు దిగంబరంగా వుంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహలలో, కొండల్లో, నదీ తీరాల్లో వుంటారు. మామూలు రోజుల్లో వారు ఎవరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో వుంటాయి.

ఇక్కడ మనకు మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటి దాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు వుంటాయి. ఎక్కడైనా,ఏ ఫోటోగ్రాఫర్ కు అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కన్పించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యెక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కన్పించాయా?లేదే? సరిగ్గా అందరూ ఒకేసారి, కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్ష మవుతారు? కుంభ మేలా ముగిశాక ,తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకే కన్పించి హటాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కన్పించదు?

వీటన్నింటికీ సమాధానం ఒకటే అదే సూక్ష్మ శరీర యానం .అదే నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్ళుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కన్పిస్తుంటే దాన్ని మనం నమ్మం. అమెరికా వాడు, రష్యా వాడు, చైనా వాడు, జపాన్ వాడు, జర్మనీ వాడు చెప్పే సొల్లు అంతా విని చంకలు ఎగరేస్తుంటాం. ఒక్కసారి మనసు పెట్టి మన శాస్త్రాలు చదవండి. వాటిని అనుసరించి,అమలు చేసే ప్రయత్నం చెయ్యండి. ప్రపంచానికి మళ్ళీ మనం పాఠాలు చెప్పొచ్చు.

- షేక్ సాధిక్ అలీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+