సాయిబాబ గుడిలో పేలుడు: నిందితుడు16 ఏళ్లుగా అత్తరు అమ్ముతూ
హైదరాబాద్: దిల్‌షుక్ నగర్‌లో గల సాయిబాబా ఆలయంలో పేలుళ్ల కేసు నిందితుడు మొహమ్మద్ షఫీక్ ముజావార్‌ను ఖతర్ తెలంగాణ పోలీసులకు అప్పగించింది. సాయిబాబా ఆలయంలో 2002లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.
లష్కరే తోయిబా కార్యకర్తగా భావిస్తున్న నిందితుడు షఫీక్ గత 16 ఏళ్లుగా దుబాయ్‌లో అత్తరు అమ్ముతున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నిందితుడు ముజావార్ పేలుళ్ల కోసం దుబాయ్‌లో సహ నిందితులతో కలిసి సమావేశాలు నిర్వహించి కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

సాయిబా ఆలయంలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. ముజావార్ నిషేధిత సిమీ కార్యకర్త అని తెలుస్తోంది. ఒకటో నిందితుడు మొహమ్మద్ బారీ ఇంకా పరారీలో ఉన్నాడు. అతను కూడా దుబాయ్‌లోనే ఆశ్రయం పొంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
కేసులో పోలీసులు 11 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో కొంత మంది మధ్యలో మరణించారు. ఇతరులపై విచారణ సాగుతోంది. దుబాయ్ నుంచి దోహాకు వెళ్తుండగా షఫీక్‌ను పట్టుకున్నారు. మంగళవారంనాడు అతన్ని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications