వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపికి మాజీ మంత్రి సమరసింహారెడ్డి రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

Samarasimha Reddy resigns from TDP
మహబూబ్‌నగర్: రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి డికె సమరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించలేదు. ఆయనకు కేటాయించాల్సిన సీటును బిజెపికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు.

ఆ సీటును బిజెపికి కేటాయిస్తున్నట్లు మాట వరుసకు కూడ సమరసింహారెడ్డితో చెప్పలేదు. దాంతో అలక వహించిన సమరసింహారెడ్డి గత కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. గత ఐదు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖను పార్టీ అధ్యక్షులకు పంపినట్లు ఆయన అనుచరులు తెలిపారు.

అప్పట్లో పార్టీ నాయకులు ఇతర పార్టీలకు వలసలు పోతున్న సమంయలో తెలుగుదేశం పార్టీకి 2013లో సమరసింహారెడ్డి పార్టీలో చేరి కొంత ఉత్సాహాన్ని నింపారు. సుమారు నెల రోజులపాటు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి చురుకుగా తీసుకెళ్లినప్పటికి టికెట్ విషయంలో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది.

సమరసింహా రెడ్డి కాంగ్రెసు పార్టీలో ప్రముఖ నాయకుడిగా వెలుగొందుతూ వచ్చారు. పలు ప్రభుత్వాల్లో ఆయన మంత్రిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన మంత్రిగా పనిచేసి అందరి మెప్పూ పొందారు.

మహబూబ్‌నగర్ జిల్లాలో తన సోదరుడు భరత్ సింహారెడ్డితో పాటు ఆయన సతీమణి డికె ఆరుణ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సమరసింహా రెడ్డి రాజకీయంగా దెబ్బ తింటూ వచ్చారు. ఆయన చాలా కాలంగా ఏ పార్టీలోనూ ఇమడలేకపోతున్నారు.

English summary
Former minister DK Samarasimha Reddy, belongs to Mahaboobnagar district, has resigned from Andhra Pradesh lead Telugudesam party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X