Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Medaram: వరదలోనే మేడారం.. వైరల్ అవుతున్న వీడియోలు..

అసాధారణ వర్షాలతో ములుగు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పోర్లాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలకు వరద తాకిడి భారీగా ఉంది. ఇప్పటికి కూడా చాలా గ్రామాలు నీటిలో ఉన్నాయి. అటు మేడారంలో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మేడారం జలదిగ్భంధంలో చిక్కుకుంది. భారీ వర్షాలకు, వరదలతో మేడారం అంతా నీరు వచ్చింది. దీంతో సమ్మక్క, సారలమ్మ గద్దెలు నీటిలో మునిగిపోయాయి. అమ్మవార్ల ఆలయాల్లో మోకాళ్లలోతు వరకు నీరు ఉంది.

ఆలయాల బయట కూడా దయనీయంగా మారింది. ఆలయం బయట ఉన్న దుకాణాలు కూలిపోవడంతో పాటు అందులో ఉన్న పూజా సామగ్రి కొట్టుకుపోయింది. వరద తాకిడికి గుడిసెలు కొట్టుకుపోవడంతో అందులో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులయ్యారు. వారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరదలో చిక్కుకున్న మేడారం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సీతక్క వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ బాధితులకు భరోసా ఇస్తున్నారు.

medaram1

వరద నీటిలోనే నడుస్తూ ప్రజలను కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం వరదలో చిక్కుకున్న వారిని రక్షించాలని సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. తమ ప్రజలను రక్షించాలని సీతక్క కన్నీరు పెట్టుకున్నారు. సీతక్క కష్టంలో ఉన్న ప్రజల కోసం తిరుగుతుంటే.. కొందరు ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఇలా చేస్తున్నారని విమర్శించారు.

దొడ్ల, మల్యాల, కొండాయిలో వరదలో గల్లంతైన 8 మంది మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. వారి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే సీతక్క బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ వద్ద హెలికాప్టర్‌ ఉండి ఉంటే వారిని కాపాడుకునే వాళ్లమని సీతక్క ట్వీట్‌ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+