భర్త చిత్రహింసలు: ‘బుల్లెట్ రాణి’ వైవాహిక జీవితం నరకమే!

Subscribe to Oneindia Telugu
Sana Iqbal lost life బుల్లెట్ రాణి సనా ఇక్బాల్‌ మృతి : ప్రమాదమా? చంపేశారా? | Oneindia Telugu

హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఆత్మహత్యలకు వ్యతిరేకంగా స్ఫూర్తి యాత్ర చేసిన మహిళా బైకర్ సనా ఇక్బాల్ తన వైవాహిక జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. తన భర్త నుంచి ఎన్నో వేధింపులను భరించారు. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సనా మరణించడంతో భర్త వేధింపులను గురించి ఆమె తన స్నేహితులకు పంపిన ఓ ఈమెయిల్ ఇప్పుడు బహిర్గతమైంది.

ప్రమాదమా? చంపేశారా?: బుల్లెట్ రాణి అనుమానాస్పద మృతి

వేధింపులు, అమ్మను బెదరించి..

వేధింపులు, అమ్మను బెదరించి..

‘హాయ్... నేను ఈ మెసేజ్ నీకు, నాకేమైనే జరిగితే సాక్ష్యంగా నిలిచే వారికి ఈ మెసేజ్ పంపిస్తున్నా. నేను ఉద్యోగిరీత్యా రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్నా. తెల్లవారుజామున 3గంటలకు ఇంటికి చేరుకుంటాను. ఆ సమయంలో కూడా నన్ను దుర్భాషలాడుతూ.. భర్త వేధించేవాడు. నా తల్లిని బెదిరింపులకు గురిచేసి ఇంటి నుంచి, నగరం నుంచి వెళ్లగొట్టాడు. దీంతో ఆమె చెన్నైకి వెళ్లిపోయింది' అని సనా వివరించారు.

చిన్న విషయానికే గొడవ..

చిన్న విషయానికే గొడవ..

‘ప్రతి చిన్న విషయానికి గొడవకు దిగేవాడు. రోడ్లపైనే తనతో తగాదాలు పెట్టుకునేవాడు. ఎప్పుడూ నా తల్లి నాకు అండగా నిలించింది. ముఖ్యంగా నేను గర్భవతిగా ఉన్న సమయంలో నా తల్లి నాకు చాలా అండగా నిలిచింది' అని సనా పేర్కొన్నారు.

ఎప్పుడూ వేధించేవాడు..

ఎప్పుడూ వేధించేవాడు..

అంతేగాక, తన భర్త నదీమ్.. ఎన్నిసార్లు తనను వేధింపులకు గురిచేశాడో చెప్పుకుంటూ సనా తీవ్రంగా వాపోయారు. అభ్యంతర, అసభ్యకరమైన భాషను ఉపయోగించి తనతోపాటు తన తల్లిని కూడా దూషించేవాడని ఆవేదన వ్యక్తం చేశారు.

నదీమ్ సోదరి కూడా.. నేను చనిపోతే..

నదీమ్ సోదరి కూడా.. నేను చనిపోతే..

తనకు అలీ అనే కుమారుడు జన్మించిన తర్వాత కూడా వేధింపులు తగ్గలేదని చెప్పారు. నదీమ్‌తోపాటు అతని 16ఏళ్ల సోదరి కూడా తనను చిత్రహింసలకు గురిచేసేదని సనా ఇక్బాల్ వివరించారు. ఒక వేళ తాను గుండెపోటు లాంటి ఆకస్మిక కారణంతో చనిపోతే తన స్నేహితులెవ్వరూ కూడా అది సాధారణంగా మరణంగా తీసుకోవద్దని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An email sent by Sana Iqbal to her friends detailing how she was being tortured by her husband has gone viral after her death.
Please Wait while comments are loading...