బైకర్ సనాది హత్య కాదు, ప్రమాదమే: తేల్చేసిన భర్త నదీమ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రముఖ మహిళా బైక్ రైడర్ సనా ఇక్బాల్ అనుమానాస్పద మృతిపై ఆమె భర్త నదీమ్ స్పందించారు. ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలోనే తన భార్య సనా ఇక్బాల్‌ మృతి చెందిందని ఆమె భర్త అబ్దుల్‌ నదీం తెలిపారు. సనాను తానే హత్య చేశానని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపడేశారు. ఈ కేసు విషయంలో తాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.

  Sana Iqbal lost life బుల్లెట్ రాణి సనా ఇక్బాల్‌ మృతి : ప్రమాదమా? చంపేశారా? | Oneindia Telugu

  అర్ధరాత్రి భర్త గొడవ, సనా ఒంటిపై గాయాలు: అసలేం జరిగింది? తల్లి ఏం చెప్పింది?

  మూడేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి..

  మూడేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి..

  సనా మృతి పట్ల తనపైన వస్తున్న ఆరోపణలకు సమాధానంగా నదీం ఆదివారం టోలిచౌకి ఐఏఎస్‌కాలనీలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సనా, తాను పదేళ్లుగా ప్రేమించుకున్నామన్నారు. మూడేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నామని తెలిపారు.

  సనా ఓ సాహసి: స్ఫూర్తి పాఠం ఈ హైదరాబాదీ బైకర్, 38వేల కి.మీల ఒంటరి ప్రయాణం

  రెండుళ్లుగా విడిగానే...

  రెండుళ్లుగా విడిగానే...

  తన రెండేళ్ల కుమారుడు అలీ ఏడాదిగా తన వద్దే ఉంటున్నాడన్నారు. చిన్నపాటి మనస్పర్థల కారణంగా తాము రెండున్నర సంవత్సరాలుగా విడిగా ఉంటున్నామని నదీమ్ తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఓ చిన్న వివాదం జరిగి సనా, తాను హుమాయూన్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నామని చెప్పారు. దీంతో పోలీసులు తమకు కౌన్సిలింగ్‌ నిర్వహించారన్నారు.

  చిన్న మనస్పర్థలే.. హత్య చేసేంత కాదు..

  చిన్న మనస్పర్థలే.. హత్య చేసేంత కాదు..

  తమ మధ్య చిన్నపాటి మనస్పర్థలు మాత్రమే ఉన్నాయని, అవి హత్య చేసేంత పెద్దవి కావన్నారు. సనా కుటుంబసభ్యులు, మిత్రులు తాను హత్య చేశానని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తనపైన వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని త్వరలోనే పోలీసుల విచారణలో తేలుతుందన్నారు.

  సనా మృతికి అదే కారణంగా..

  సనా మృతికి అదే కారణంగా..

  తమ కుమారుడు అలీ.. సనా వద్ద ఉండటంతో తన విధులు ముగించుకుని రాత్రి 3.30 గంటల సమయంలో తాను అలీని చూసేందుకు అల్‌హస్‌నత్‌కాలనీలోని సనా ఇంటికి వెళ్లినట్లు నదీమ్ తెలిపారు. అలీకి పాలు కొందామని సనా చెప్పడంతో ఇద్దరం బయటకు వెళ్లామన్నారు. కారు రోడ్డు డివైడర్‌కు ఢీకొట్టుకోవడంతో అదుపు తప్పి వాహనం పల్టీలు కొట్టిందన్నారు. సనా కూర్చున్నవైపు విద్యుత్‌ స్తంభం ఉండటంతో కారు డోరుకు తగిలి సనా తీవ్రంగా గాయపడి మృతి చెందిందని వివరించారు. ఇది ఇలా ఉంటే.. సనా తల్లి మాత్రం కుట్ర పూరితంగానే తన కూతురును నదీమ్ హత్య చేశాడని ఆరోపించిన విషయం తెలిసిందే.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Less than a week after city woman biker Sana Iqbal's death in a tragic accident, her husband Abdul Nadeem on Sunday reiterated that she died in the accident and gave details of the ill-fated day.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి