ముగిసిన కస్టడీ: సండ్ర ప్రశ్నలకు సమాధానం చెప్పని ఏసీబీ!?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ5 నిందితుడు సండ్ర వెంకట వీరయ్య కస్టడీ రెండో రోజు శుక్రవారం నాడు ముగిసింది. ఆయనను న్యాయస్థానం రెండు రోజుల ఏసీబీ కస్టడీకి ఇచ్చింది. ఈ రోజుతో ముగిసింది. దీంతో ఆయనను ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచింది.
ఈ సందర్భంగా జడ్జి.. వైద్య పరీక్షలు నిర్వహించారా అని ప్రశ్నించారు. దానికి తన ఆరోగ్యం బాగానే ఉందని సండ్ర చెప్పారు. ఏసీబీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని చెప్పారు. టీఆర్ఎస్ నేతలు తమ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి బెదిరించి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. దాని పైన కూడా విచారణ జరపాలని కోరారు.

ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అతను తెలిపారు. తన పైన ఎలాంటి థర్డ్ డిగ్రీ ఉపయోగించలేదని చెప్పారు. కాగా, తాను అడిగిన ప్రశ్నలకు ఎసిబి ఎలాంటి సమాధానం చెప్పలేదని సండ్ర చెప్పినట్లుగా తెలుస్తోంది.
తాను వారిని కొన్ని ప్రశ్నలు అడిగానని, తాను అడిగిన ప్రశ్నలకు వారి వద్ద సమాధానం లేదని చెప్పారని సమాచారం.
తమ ఎమ్మెల్యేలను తెలంగాణ సర్కారు ప్రలోభ పెట్టి చేర్చుకుందని, తక్కువ ఎమ్మెల్యేలు ఉండి అన్ని ఎమ్మెల్సీ సీట్లు ఎలా గెలుచుకోవడానికి కారణం ఏమిటని అడిగానని చెప్పారు. కాగా, కోర్టు ఎదుట హాజరుపరిచిన అనంతరం సండ్రను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్రకు ఈ నెల 21వ వరకు రిమాండ్ పొడిగించారు.












Click it and Unblock the Notifications