ఓటుకు నోటుతో సంబంధం లేదు, ఏ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదు: సండ్ర
హైదరాబాద్: తనకు ఓటుకు నోటు కేసుతో ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆయన సోమవారం ఏసిబి ముందు హాజరయ్యారు. అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఏ ఎమ్మెల్యేతోనూ మాట్లాడలేదనీ.. ఇందులో తనకు సంబంధం లేదని అన్నారు.
ఏసిబి అధికారులు విచారణకు పిలిస్తేనే వచ్చానని సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఏసిబి విచారణకు పూర్తిగా సహకరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో ఏసిబి
విచారణకు హాజరుకావాలని సండ్ర వెంకటవీరయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయన సోమవారం ఏసిబి ముందు విచారణకు హాజరయ్యారు. సోమవారం ఉదయం ఏసీబీ కార్యాలయానికి విచారణకు వచ్చారు.
కాగా, అనారోగ్య కారణాలతో సండ్ర వెంకటవీరయ్య గతంలో ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయనకు ఏసీబీ మరోసారి నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications