గ్రామంలో వరద ముంపు.. ఆ రైలును ఆపి గ్రామస్తుల డిమాండ్!

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా సంగం కలాన్ గ్రామస్తులు గూడ్స్ రైలు ని అడ్డుకుని ఆందోళన చేశారు. రైల్వే ట్రాక్ పైన కూర్చుని తమ సమస్యను రైల్వే శాఖ పట్టించుకోవాలని, పరిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. భారీ వర్షాల కారణంగా తమ గ్రామం ముంపుకు గురైందని తీవ్ర ఆందోళనలో ఉన్న గ్రామస్తులు రైల్వే శాఖ ముందు పెట్టిన డిమాండ్ ఏమిటి?

రైల్వే ట్రాక్ నిర్మించుకున్న సిమెంట్ ఫ్యాక్టరీ
రైల్వే ట్రాక్ పైన బైఠాయించి వీరు గూడ్స్ రైలును ఎందుకు అడ్డుకున్నారు అంటే దీని వెనుక ఆసక్తికరమైన కథనే ఉంది. సంగం కలాన్ గ్రామ సమీపంలో చెట్టినాడు సిమెంట్ కర్మాగారానికి రైల్వే ట్రాక్ నిర్మాణం జరిగింది. ఈ కంపెనీ తన సరుకు రవాణా సౌలభ్యం కోసం ప్రత్యేకంగా ఈ రైల్వేట్రాక్ నిర్మించుకుంది. అయితే ట్రాక్ నిర్మాణం విషయంలో సహజ నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత రైల్వేపైన ఉంటుంది.

sangam kalan village flooded Villagers dharna on railwaytrack stopped goods train demands

వరద నీరు పోకుండా అడ్డుగా మారిన రైల్వే ట్రాక్
అదేమీ పట్టించుకోకుండా రైల్వే అధికారులు అనుమతులు ఇవ్వడంతో నిర్మించిన ఈ రైల్వే ట్రాక్ కారణంగా భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరు పోయేందుకు ట్రాక్ అడ్డంగా ఉండడం వల్ల, నీరు తిరిగి గ్రామంలోకి వచ్చి గ్రామాన్ని ముంచేస్తుంది అని గ్రామస్తులు వాపోతున్నారు. సులభంగా ప్రవహించడానికి రైల్వే లైన్ కింద సరైన కల్వర్టులు, డ్రైనేజీ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఆ నీరంతా మళ్లీ గ్రామంలోకి వస్తుందని అంటున్నారు.

రైల్వే ట్రాక్ వల్లే ఇదంతా.. రైలును ఆపి ఆందోళన
ఇల్లు మునిగిపోతున్నాయి అని పంట పొలాలు మునిగిపోతున్నాయి అని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు రైల్వే ట్రాక్ పై కూర్చుని గూడ్స్ రైలును ఆపి ఆందోళన నిర్వహించారు.ఈ రైల్వే ట్రాక్ కారణంగా తమకు ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్లుతుందని, తక్షణం తమకు జరిగిన ఆస్తి నష్టాన్ని పంట నష్టాన్ని పరిశీలించి తగిన పరిహారం అందించాలని వారి డిమాండ్ చేస్తున్నారు.

రైల్వే అధికారులకు గ్రామస్తుల డిమాండ్
అంతేకాదు రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ కింద నీరు పోయే విధంగా కల్వర్టులు కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యను తక్షణం పరిష్కరించాలని వారు రైల్వే అధికారులతో పాటు సదరు సిమెంట్ కంపెనీ యాజమాన్యాన్ని సైతం కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+