"హైదరాబాద్.. విజయవాడ హైవేపై నో టోల్ ఫీజు..!"
సంక్రాంతి పండగ వచ్చిందంటే హైదరాబాద్ నగరంలోని ప్రజలు సొంతూళ్లు బయల్దేరుతారు. దాంతో హైదరాబాద్.. విజయవాడ హైవే రద్దీగా ఉంటుంది. హైవేలోని టోల్ గేట్ల వద్ద గంటలకొద్దీ వాహనాలు క్యూ కడుతుంటాయి. ఈ క్రమంలో హైదరాబాద్.. విజయవాడ హైవేపై రద్దీని తగ్గించేందుకు వీలుగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎలాంటి టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఉంటుంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాల రద్దీని తగ్గించే విధంగా టోల్ ఫీజులు లేకుండా ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. జనవరి 9 నుంచి 14 వరకు హైదరాబాద్ నుంచి విజయవాడ కు ఎలాంటి టోల్ ఫీజు లేకుండా ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని.. అలాగే జనవరి 16 నుంచి 18 వరకు విజయవాడ- హైదరాబాద్ ఉచిత ప్రయాణానికి అనుమతి కోరుతూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో స్పష్టం చేశారు. అలాగే సంక్రాంతి రోజుల్లో 200 శాతం అధికంగా ట్రాఫిక్ రద్దీ ఉంటుందని లేఖ ద్వారా తెలిపారు.

ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. రహదారులపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష అనంతరం మాట్లాడుతూ.. సమీక్షలో అనేక అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు. సంక్రాంతికి వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. పండగ రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేసి ప్రయాణాలు సజావుగా సాగేలా చూడాలన్నారు. హైదరాబాద్.. విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందన్నారు. ఈమేరకు ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు రద్దీ కారణంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా పలు విషయాలను ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications