తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక.. నిధులు విడుదల

సంక్రాంతి పండగ కానుకగా తెలంగాణలోని గ్రామ పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు రూ. 277 కోట్ల నిధులను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ లు, వార్డు మెంబర్లకు భట్టి విక్రమార్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గతేడాది డిసెంబర్ లో గ్రామాల్లో కొత్త పంచాయతీల పాలకవర్గం కొలువుదీరిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో ఎన్నికైన నూతన సర్పంచ్‌ లు, వార్డు సభ్యులు ఇప్పటికే పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

సంక్రాంతి పండగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు శుభవార్త తెలిపింది. ఈ మేరకు గ్రామ పంచాయితీలకు రూ. 277 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రామ పంచాయితీలకు నిధులు విడుదల చేస్తూ ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్, వార్డ్ మెంబర్ లకు డిప్యూటీ సీఎం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Sankranti Gift Telangana Govt Releases 277 Crore to Gram Panchayats Big Boost for Rural Development

ఇక తెలంగాణలోని మొత్తం 12,777 గ్రామ పంచాయతీలకు గతేడాది ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో ఎన్నికైన నూతన సర్పంచ్‌ లు, వార్డు సభ్యులు డిసెంబర్ 22 న పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+