వారం రోజుల్లో ఆ మహిళలకు చీరలు.. ముహూర్తం ఫిక్స్!
తెలంగాణ ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు శుభవార్త చెప్పింది. పొదుపు సంఘాల మహిళలకు దసరా బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలను పంపిణీ చేయాలని భావించిన ప్రభుత్వం అప్పుడు చీరలను పంపిణీ చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం అక్కాచెల్లెళ్లకు రేవంతన్న కానుక పేరుతో పొదుపు సంఘాలలో ఉన్న సభ్యులైన మహిళలకు ఏడాదికి రెండు చీరలను అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం, త్వరలో చీరలను అందించటానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.
వారికి ఒక్కొక్కరికి రెండు చీరలు
ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక చీరల పంపిణీ కి సంబంధించి డిఆర్డిఓ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈనెల 19వ తేదీన మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ చీరలను వారికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

పొదుపు సంఘాల మహిళల చీరల పంపిణీ అప్పుడే
దీంతో పొదుపు సంఘాలలో ఉన్న మహిళలకు రెండు చేనేత చీరలను ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డు ఉన్న మహిళలకు ఏడాదికి ఒక చీరను బతుకమ్మ పండుగ సందర్భంగా ఇవ్వగా, ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు చీరలను ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ పంపిణీకి అవసరమైన చీరలు జిల్లాలకు చేరుకున్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈనెల 19వ తేదీన ఈ చీరల పంపిణీ జరగనుంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఈ చీరల పంపిణీ తొలిసారి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ చీరల పంపిణీ తొలిసారి. గత ప్రభుత్వం అందరూ మహిళలకు ఒక్కొక్క చీర చొప్పున ఇవ్వగా, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేవలం పొదుపు సంఘాల లోని మహిళలకు మాత్రమే ఇవ్వనుంది. తెలంగాణ రాష్ట్రంలోని 65 లక్షల మందికి ఈ క్రమంలో మరొక ఎనిమిది రోజుల్లో రెండు చీరలు అందనున్నాయి.
చీరలు సిద్ధం.. అక్కా చెల్లెళ్ళకు రేవంతన్న కానుక
దీనికోసం 318 కోట్లు విడుదల చేసి చేనేత జౌళి శాఖ ద్వారా చీరల తయారీని చేపట్టి, ప్రస్తుతం చీరల పంపిణీ కోసం సిద్ధం చేశారు. ఈ చీరలను ఇవ్వడం కోసం బి ఓ పి పి లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను కూడా తయారు చేశారు. మొత్తంగా త్వరలోనే రేవంత్ రెడ్డి అందించే అక్క చెల్లెళ్లకు రేవంతన్న కానుక అందబోతోంది.












Click it and Unblock the Notifications