ట్విస్ట్‌లపై ట్విస్ట్‌లు: భార్యతో మాట్లాడిన శశికుమార్, వారెవరు?
హైదరాబాద్: హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో జరిగిన కాల్పుల ఘటన, డాక్టర్ శశికుమార్ మృతి, తదనంతర పరిణామాలు మిస్టరీగా మారాయి. కేసు పలు మలుపులు తీసుకుంటోంది. మిత్రుడి భార్య చంద్రకళ తనను ఫామ్‌హౌస్‌కు చేర్చిన తర్వాత శశికుమార్ తన భార్యతో పది నిమిషాలు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
ఉదయ్ చనిపోలేదని భార్య చెప్పడానికి ప్రయత్నించినా అతను వినిపించుకోలేదని అంటున్నారు. ఉదయ్‌ని సాయి తన రివాల్వర్‌తో కాల్చి చంపాడని శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. దీన్ని బట్టి కాల్పుల్లో ఉదయ్ మరణించాడనే శశి కుమార్ భావించినట్లు అర్థమవుతోంది. సాయి కుమార్ ఉదయ్‌ని కాల్చిన తర్వాత భయపడి తాను పారిపోయానని చెప్పాడు.

తనకు మనసు బాగాలేదని, ఫామ్ హౌస్‌లో దించాలని శశికుమార్ హిమయాత్ నగర్ ఘటన తర్వాత తన మిత్రుడి భార్య చంద్రకళ ఇంటికి వెళ్లి అడిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తన కారులో శశికుమార్‌ను తమ ఫామ్ హౌస్‌లో దించేసి వచ్చినట్లు చెబుతున్నారు.
కిరణ్ నన్ను క్షమించు, చందూ ధన్యవాదాలు అంటూ శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. తన కుటుంబాన్ని మంచిగా చూడాలని ఆయన కోరాడు. వచ్చే జన్మలోనైనా మంచి భర్తగా, తండ్రిగా ఉంటానని అందులో రాశాడు.
ఓబుల్ రెడ్డి, కెకె రెడ్డి, సాయికుమార్, చెన్నారెడ్డి, రామారావు పేర్లు రాసి వారిని శిక్షించాలని శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో రాశాడు. కాల్పుల ఘటన తర్వాత పారిపోయిన సాయి కుమార్ ఎవరనేది తెలుస్తున్నప్పటికీ, మిగతా నలుగురు ఎవరనేది తెలియడం లేదు. శశికుమార్ భార్య చంద్రకళ ఎందుకు పారిపోయారనేది తెలియడం లేదు. సాయి కుమార్ కూడా పరారీలో ఉన్నాడు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications