వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ సుప్రీంకెళ్లినా ధర్మం మనవైపే: కల సాకారమైందని హరీశ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

మహబూబ్‌నగర్: భీమా కాల్వ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం ద్వారా బంగారు తెలంగాణలో తొలి కల సాకారమైందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యేవరకూ విశ్రమించబోమని, ప్రాజెక్టులు నిర్మించి రైతుల పొలాలను తడిపి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భవించాక తొలి ప్రయోజనం పాలమూరు ప్రజలకే దక్కాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతోందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అయిన భీమా ఫేజ్-2, నెట్టెంపాడు ఫేజ్-2, కల్వకుర్తి ఫేజ్-2ల పంప్‌లను ఆయన గురువారం ప్రారంభించి కృష్ణాజలాలను వదిలారు. దీంతో శంకర సముద్రం, రామన్‌పాడు, ర్యాలంపాడు, కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు పరుగు పెట్టాయి.

ఏపీ సుప్రీంను ఆశ్రయించినా ధర్మం మనవైపే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు సర్కారు 'పాలమూరు'పై ఢిల్లీలో ఫిర్యాదు చేసిందని, సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిందన్నారు. అయినా ధర్మం తెలంగాణవైపే ఉందని, సుప్రీంకోర్టులో రాష్ట్రానికి ఊరట లభించిందని హరీశ్‌రావు చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలను రాకెట్‌ వేగంతో నిర్మించాలని సీఎం ఆదేశించారన్నారు.

మహబూబ్‌నగర్ ప్రాజెక్టులకు చంద్రబాబునాయుడు శిలఫలాలు వేస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాళ్లు వేశారని ఆయన ఎద్దేవా చేశారు. కృష్ణాజలాలపై ఇకమీదట పాలమూరు ప్రజలకే మొదటి హక్కు అని మంత్రి హరీష్‌రావు తెల్చి చెప్పారు.

రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద భూసేకరణను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొడుతోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని డీకే అరుణ తదితరులు నేడు పాదయాత్రలు, దీక్షలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుల్లో కేసులు వేసి పనులు నిలిపివేయాలని కుట్రలు చేస్తున్నారన్నారు.

కల సాకారమైంది

కల సాకారమైంది

భీమా కాల్వ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, భీమా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం ద్వారా బంగారు తెలంగాణలో తొలి కల సాకారమైందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.

పంప్‌ల ప్రారంభం

పంప్‌ల ప్రారంభం

తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యేవరకూ విశ్రమించబోమని, ప్రాజెక్టులు నిర్మించి రైతుల పొలాలను తడిపి వారి కళ్లల్లో ఆనందాన్ని చూస్తామని పేర్కొన్నారు.

పాలమూరుకు తొలి ప్రయోజనం

పాలమూరుకు తొలి ప్రయోజనం

తెలంగాణ ఆవిర్భవించాక తొలి ప్రయోజనం పాలమూరు ప్రజలకే దక్కాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతోందన్నారు.

పరుగుపెట్టిన జలాలు

పరుగుపెట్టిన జలాలు

మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు అయిన భీమా ఫేజ్-2, నెట్టెంపాడు ఫేజ్-2, కల్వకుర్తి ఫేజ్-2ల పంప్‌లను ఆయన గురువారం ప్రారంభించి కృష్ణాజలాలను వదిలారు. దీంతో శంకర సముద్రం, రామన్‌పాడు, ర్యాలంపాడు, కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లోకి కృష్ణాజలాలు పరుగు పెట్టాయి.

హరీశ్ రావు

హరీశ్ రావు

కార్యక్రమాల్లో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కలెక్టర్‌ శ్రీదేవి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

హరీశ్ రావు

హరీశ్ రావు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సమావేశాల్లో హరీశ్‌రావు మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాకు తొలి ఫలితం దక్కిందని, ఈ ఫలితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినందుకే గత 30 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల పొలాల్లోకి కృష్ణాజలాలను వదలడం జరిగిందన్నారు.

ఇరిగేషన్ ప్రాజెక్ట్

ఇరిగేషన్ ప్రాజెక్ట్

మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే వలసల జిల్లా అని ప్రపంచమంత చెప్పుకుంటుందని, రానున్న కాలంలో ఇక పాలమూరుకే ప్రజలు వలసలు వచ్చేలా తయారవుతుందన్నారు.

ప్రాజెక్ట్ ప్రారంభం

ప్రాజెక్ట్ ప్రారంభం

భీమా ప్రాజెక్టు 1985లో మంజూరు అయ్యిందని ఈ ప్రాజెక్టుకు 20 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ఏ రోజూ ఒక్క టిఎంసి నీటిని కూడా కృష్ణానది నుండి తీసుకున్న పాపాన పోలేదని అన్నారు.

జలాల పరుగు

జలాల పరుగు

మహబూబ్‌నగర్ జిల్లాలో భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.900కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. మరో రూ.1600కోట్లకుపైగా ఖర్చు చేస్తే పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి అవుతాయన్నారు.

జలాలు ఇలా వెళతాయి

జలాలు ఇలా వెళతాయి

టిడిపి, కాంగ్రెస్ నాయకులు పెండింగ్ ప్రాజెక్టులను 90శాతం పూర్తి చేశామని చెప్పే మాటల్లో వాస్తవం లేదని, వారు నిధులు మాత్రమే 90 శాతం డ్రా చేసుకున్నారని, పనులు మాత్రం 40 నుండి 55 శాతం పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు.

 జురాల జలాల్లో బతుకమ్మ

జురాల జలాల్లో బతుకమ్మ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మోటర్లు, డిస్టిబ్యూటర్లు, సంపులను నిర్మించి వాటిని ప్రస్తుతం 80 శాతానికి తీసుకువచ్చామన్నారు.

 ప్రారంభోత్సం

ప్రారంభోత్సం

తాము పూర్తి చేసిన పనుల్లోనే ఒక్కొక్క పంప్‌ను ప్రస్తుతం ప్రారంభించామని వీటి ద్వారా ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనున్నామని వెల్లడించారు.

ప్రారంభం

ప్రారంభం

వచ్చే ఏడాది ఖరీఫ్‌లో మరో 8లక్షల ఎకరాలకు మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీరును అందిస్తామన్నారు.

జలాలు అలా వెళ్తున్నాయి

జలాలు అలా వెళ్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబునాయుడు సర్కారు ‘పాలమూరు'పై ఢిల్లీలో ఫిర్యాదు చేసిందని, సుప్రీంకోర్టులో కూడా కేసు వేసిందన్నారు. అయినా ధర్మం తెలంగాణవైపే ఉందని, సుప్రీంకోర్టులో రాష్ట్రానికి ఊరట లభించిందని హరీశ్‌రావు చెప్పారు.

English summary
Accusing the Opposition and the AP government of trying to stall TS projects, irrigation minister T. Harish Rao on Wednesday said that the Supreme Court’s ruling on the issue was a slap on the face of AP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X