ఏపీ, తెలంగాణల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం 2019 మార్చి 29తో పూర్తికానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి, తెలంగాణలో.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీకి ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
ఓటర్ల జాబితా కోసం అక్టోబరు 1న ప్రకటన విడుదల చేయనుంది. నవంబరు 6వరకు ఓటు హక్కు కోసం దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications