మరో దారుణం: బాలుడి మృతదేహాన్ని సంచిలో పెట్టి ఆటోలో పడేశారు

నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి హత్య ఘటన మరువక ముందే మరో బాలుడు దారుణ హత్య గురయ్యాడు. జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లేబర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వరంగల్: నగరంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి హత్య ఘటన మరువక ముందే మరో బాలుడు దారుణ హత్య గురయ్యాడు.
జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ లేబర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

11వ డివిజన్‌లోని తెలుగు మీడియం అసిన్ స్కూల్ దగ్గర కడారి వినయ్(8) అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి ప్లాస్టిక్ సంచిలో పెట్టి ఆటోలో వేసి వెళ్లారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

 A school boy allegedly killed in Warangal

బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, యూనిక్ పాఠశాలలో చదువుతున్న వినయ్ బుధవారం అదృశ్యమవడం గమనార్హం.

పాఠశాలకు వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి దారుణ హత్యతో స్థానికులు భయాందోళలకు గురవుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి తల్లిదండ్రుల ప్రత్యర్థులేవరైనా ఈ హత్యకు చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+