సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు ప్రారంభం

హైదరాబాద్: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నర కాలంగా మూతబడిన విద్యాలయాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో విద్యాసంస్థలు తెరవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల పునర్ ప్రారంభంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం సమావేశమై చర్చించారు.

సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. కరోనా మహమ్మారి ప్రభావంతో గత ఏడాది నుంచి విద్యాసంస్థలు మూతపడ్డాయి. మధ్య కొంతకాలం తొమ్మిది ఆపై తరగతులు పాక్షికంగా ప్రారంభించగా.. రెండో దశ తీవ్రత పెరగడంతో మళ్లీ ఆన్‌లైన్ తరగతులకే పరిమితం చేశారు. జులై మొదటి నుంచే అన్ని తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. హైకోర్టు పలు ప్రశ్నలు సంధించడంతో వెనక్కి తగ్గింది.

schools and colleges will reopen from september 1st in telangana.

కాగా, సెప్టెంబర్ 1 నుంచి విద్యాలయాల పునర్ ప్రారంభం నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు, సూచనలు చేశారు. చాలా రోజులపాటు పాఠశాలలు మూతబడి ఉండడం మూలాన, గ్రామాలు, పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లదేనన్నారు.

మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి సానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఎంపీవోలు, ఎంపీడీవోలు, డిపీవోలు, ఎంపీవోలు ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యతతీసుకోవాలన్నారు.

ఆగస్టు 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల సానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. విద్యాసంస్థలు తెరిచిన తర్వాత స్కూళ్లలోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన వుంటే ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే సమీపంలోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సీఎం సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు సానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణా చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను కోరారు.

కాగా, గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాలు ఆగస్టు నెలలోనే విద్యాసంస్థలు తెరిచాయి. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కాగా, ఆన్‌లైన్‌ పాఠాలు ఫలితాన్ని ఇవ్వకపోవడం, ఇతరత్రా కారణాలతో కొందరు తల్లిదండ్రులు కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా, కరోనా నిబంధనలు పాటిస్తూనే తరగతులు నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు తగ్గాయి. రాష్ట్రంలో కొత్తగా 46,987 కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కేవలం 231 మందికి మాత్రమే పాజిటివ్ కేసులు వయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 66 కొత్త కేసులు రాగా.. కరీంనగర్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వికారాబాద్, నాగర్ కర్నూల్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. 453 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,54,989 పాజిటివ్ కేసులు వచ్చాయి. 6,44,747 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇంకా 6,384 మంది చికిత్స పొందుతున్నారు. అటు, కరోనా మృతుల సంఖ్య 3,858కి పెరిగింది.

మరోవైపు దేశ వ్యాప్తంగానూ కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 25,072 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 19 శాతం తగ్గుదల నమోదయినట్లుగా తెలుస్తుంది. అంతేకాదు గత 24 గంటల్లో దేశంలో 389 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. క్రియాశీల రేటు తగ్గటం, రికవరీ రేటు పెరగటం దేశానికి ప్రస్తుతం ఊరట కలిగిస్తున్న అంశం.

భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్న మొత్తం కేసులు 3.24 కోట్లకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,34,756 గా ఉంది. నిన్న ఒక్కరోజే కరోనా మహమ్మారి బారి 44,157 మంది కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలు 3.16 కోట్లకు చేరుకున్నాయి. కొద్ది రోజులుగా క్రియాశీల కేసులు కూడా భారీగా తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో క్రియాశీల కేసులు 3,33,924 గా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+