తెలంగాణలో బుధవారం పాఠశాలలు బంద్!
హైదరాబాద్: విద్యార్థుల సమస్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల వసూలుకు వ్యతిరేకంగా అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) పలు నిరసన కార్యక్రమాలను ఇప్పటికే కొనసాగిస్తోంది. తాజాగా, ఫీజుల పెంపునకు నిరసనగా పాఠశాలల బంద్‌కు పిలునిస్తున్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యా సంస్థలను మూసివేయించాయి. తెలంగాణలోనూ గత నెలలో బంద్ నిర్వహించింది. ఇప్పుడు తెలంగాణలో విద్యా రంగంలో జరుగుతోన్న అక్రమ ఫీజు దోపిడీకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) నిర్ణయించింది. ఇందులో భాగంగానే జులై 12వ తేదీన విద్యా సంస్థలు బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది.

ఏఐఎస్‌ఎఫ్ నాయకులు హైదరాబాద్‌లోని కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగ సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ నాయకులు విమర్శించారు. విద్యా రంగానికి బడ్జెట్‌లో సరైన కేటాయింపులు చేయడం లేదంటూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందంటూ ఆరోపించారు.
ఈ నేపథ్యంలోనే విద్యా రంగంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిలంచాలని, స్కూల్ ఫీజులను తగ్గించాలనే డిమాండ్‌తో జులై 12వ తేదీ (బుధవారం) రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నీ బంద్ చేయాలంటూ పిలుపునిచ్చింది. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోనూ ఏబీవీపీ నాయకులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. 15వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బుక్స్, యూనిఫాం వెంటనే అందజేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. డీఎస్సీ, ఎంఈవో రిక్రూట్‌మెంట్ విడుదల చేసి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలన్నారు.












Click it and Unblock the Notifications