అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు- షెడ్యూల్..!!
అయ్యప్ప భక్తుల కోసం రైల్వే శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. దక్షిణ మధ్య రైల్వే శబరిమల కు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శబరి మల కు వెళ్తూ ఉంటారు. ఈ ఏడాది వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటికే సాధారణ రైళ్లలో న రూమ్ కనిపిస్తోంది. దీంతో, భక్తుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు 26 ప్రత్యేక రైళ్లను నడపాల ని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించింది.
శబరిమల భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్, కాచి గూడ, హైదరాబాద్, మౌలాలి నుంచి కొట్టాయం తో పాటుగా కొచ్చి వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. మొత్తం 26 ప్రత్యేక రైళ్లు నవంబర్ 17 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రయాణికులకు అందు బాటులో ఉండనన్నాయి. కాచిగూడ-కొట్టాయం రైలు (07131/07132)- నవంబర్ 17, 24 తేదీల్లో.. కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

కాచిగూడ-కొట్టాయం-కాచిగూడ (07133/07134)- నవంబర్ 18, 25 తేదీల్లో.. సోమవారం రాత్రి 8.50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు కొట్టాయం చేరే విధంగా షెడ్యూల్ ఖరారు చేసారు. ఈ రైలు కాచిగూడ నుంచి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూ బ్‌నగర్ మీదుగా కోయంబత్తూరు, పాలక్కాడ్, త్రిస్సూర్, అలవా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా గమ్యస్థానం చేరుతుంది. హైదరాబాద్-కొట్టాయం-హైదరాబాద్ (07135/07136)- ఈ నెల 19, 26 తేదీలలో.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుతుంది.
ఈ రైలు హైదరాబాద్ నుంచి బయలుదేరి బేగంపేట, లింగంపల్లి, శంకరపల్లి, వికారాబాద్, తాండూరు, సేరం, యాద్గిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోనీ, గుంతకల్, కోయం బత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఇక,
సికింద్రాబాద్- కొట్టాయం-సికింద్రాబాద్ (07137/07138)- నవంబర్ 16, 23, 30వ తేదీల్లో.. ప్రతి శనివారం రాత్రి 9.45 గంటలకు కొట్టాయంలో బయల్దేరి సోమవారం రాత్రి 12.50కు సికింద్రాబాద్ చేరుతుంది.
సికింద్రాబాద్‌లో ఈ రైలు నవంబర్ 22, 29 తేదీల్లో బయలుదేరుతుంది. నాందేడ్-కొల్లం-సికింద్రాబాద్ (07139/07140)- నవంబర్ 16న నాందేడ్‌లో, నవంబర్ 18న కొట్టాయంలో బయలుదేరుతుంది. మౌలాలి-కొల్లాం-మౌలాలి (0714/07142)- ఈ నెల 23, 30 తేదీల్లో మౌలాలి నుంచి బయలుదేరి ఎర్నాకుళం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగచేరి స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications