మరో ప్రధాన ఎక్స్ ప్రెస్ రైలు చర్లపల్లి నుంచే - వేళల మార్పు..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు మరో కీలక ప్రకటన చేసారు. ఇప్పటికే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లను చర్లపల్లి టెర్మినల్ కు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మరో ప్రధాన రైలు రాకపోకల్లోనూ మార్పులు చేసారు. సికింద్రాబాద్ స్టేషనల్ లో ఆధునీక రణ పనులు జరుగుతుండటంతో రైళ్ల రాకపోకల్లో మార్పులు చేస్తున్నారు. సికింద్రాబాద్ లో రైళ్ల రద్దీని తగ్గించడానికి చర్లపల్లి టెర్మినల్‌ను రైల్వేశాఖ సిద్ధం చేసింది. ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వెళ్లే మరో రైలుకు సంబంధించి ప్రకటన చేసారు.
తాజా మార్పులు
సికింద్రాబాద్-రేపల్లెమధ్య నడిచే(17645) ఎక్స్‌ప్రెస్ బయల్దేరే టెర్మినల్ ఈ నెల 15 నుంచి చర్లపల్లికి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైలు చర్లపల్లి నుంచి ఇంతకు ముందు ప్రకటించిన సమయం మధ్యాహ్నం 1.30గంటలకు బదులు మధ్యాహ్నం ఒంటి గంటకు (అరగంట ముందుగా) బయల్దేరుతుందని వెల్లడించారు. ఈ మార్గంలో ఆగే ఇతర స్టేషన్లు/ వేళల్లో ఎటువంటి మార్పులేదని పేర్కొన్నారు. సుదీర్ఘ కాలంగా ఈ రైలు ఈ మార్గంలో కొనసాగు తోంది. తొలుత ప్యాసింజర్ రైలుగా ప్రారంభమై.. తరువాత ఎక్స్ ప్రెస్ గా మార్పు చేసారు. ఈ మార్గంలో పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు ఈ రైలును వినియోగిస్తారు.

చర్లపల్లి నుంచి
ఇప్పటికే పలు రైళ్లు చర్లపల్లి నుంచి నడుస్తున్నాయి. తిరుపతి-ఆదిలాబాద్ కృష్ణా ఎక్స్‌ప్రెస్ (17405) చర్లపల్లి టెర్మినల్ నుంచి రాత్రి 8.10 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు బొల్లారం స్టేషన్లో రాత్రి 9.14కి ఆగుతుంది. మళ్లీ ఆదిలాబాద్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈ రైలు(17406) బొల్లారం స్టేషన్‌కు ఉదయం 4.29 గంటలకు, చర్లపల్లికి 5.45 గంటలకు వస్తుంది. కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు (07446) ఉదయం చర్లపల్లి నుంచి 7.20 గంటలకు బయలుదేరుతుంది. లింగంపల్లికి 9.15కి చేరుతుంది.
రైల్వే అధికారుల నిర్ణయం
తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07445) లింగంపల్లి నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయ లుదేరి చర్లపల్లికి 7.30 గంటలకు చేరుతుంది. ఈ నిర్ణయం జులై 1 వరకు అమల్లో ఉంటుంది. కాజీపేట-హదాప్పర్ ఎక్స్‌ప్రెస్(17014) చర్లపల్లికి రాత్రి 8.20 గంటలకు వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (17013) చర్లపల్లికి తెల్లవారుజామున 3 గంటలకు చేరుతోంది. ఇక,లింగంపల్లి-విశాఖపట్టణం(12806) జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఉదయం 7.15కి చర్లపల్లికి వస్తుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (12805) సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లి చేరుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యే వరకూ ఈ నిర్ణయాలు అమల్లో ఉండనున్నాయి.












Click it and Unblock the Notifications