హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు పొడిగింపు- హాల్ట్ స్టేషన్లు

Special trains: పండగ సీజన్ లో రైళ్లన్నీ కూడా కిటకిటలాడుతుంటాయి. క్రిక్కిరిసిపోతుంటాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే పండగలు, ప్రత్యేక రోజులు, వీకెండ్ లల్లో రైళ్లకు ప్రయాణికుల తాకిడి అధికం. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు కొత్త ఎక్స్ ప్రెస్ సర్వీసులు, ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను వివిధ మార్గాల్లో నడిపిస్తోన్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి, హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు ఆయా రైళ్లు రాకపోకలు సాగిస్తోన్నాయి. లక్షలాదిమంది ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి.

SCR extends Hyderabad-Jaipur Specil train upto November 28

తాజాగా మరో ఎక్స్ ప్రెస్ ను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. హైదరాబాద్- జైపూర్ మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ ఇది. సెప్టెంబర్ 26వ తేదీన ఈ ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కింది. అక్టోబర్ చివరివారం వరకు అందుబాటులో ఉండాల్సి ఉంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును దాదాపుగా రెండున్నర నెలల పాటు పొడిగించారు. నవంబర్ 28వ తేదీ వరకు ఈ రైలు నడుస్తుంది.

నవంబర్ 28వ తేదీ వరకు ప్రతి శుక్రవారం హైదరాబాద్ నాంపల్లి నుంచి సాయంత్రం 7:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07020 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 5:25 నిమిషాలకు జైపూర్ కు చేరుకుంటుంది.

ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు జైపూర్ నుంచి బయలుదేరే నంబర్ 07019 ప్రత్యేక రైలు రెండో రోజు తెల్లవారు జామున 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.

ఫులేరా, కిషన్ గఢ్, అజ్మీర్, బిజయ్ నగర్, భిల్వారా, చిత్తోడ్ గఢ్, నీమచ్, మందసౌర్, రత్లాం, ఉజ్జయిని, భోపాల్, ఇటార్సీ, ఖండ్వా, మల్కాపూర్, అకోలా, వషీం, హింగోళి, బస్మత్, పూర్ణా, నాందెడ్, ముద్ఖేడ్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+