రైల్వే ప్రయాణీకులు ఇక రిలాక్స్ - రిటైరింగ్ రూమ్స్ రెడీ : ఎలా పొందాలంటే..!!
రైల్వే ప్రయాణీకులు రిలాక్స్ ఆవ్వండి. కరోనా తరువాత క్రమేణా పెరుగతూ వచ్చిన రైల్వే సేవలు..ఇప్పుడు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. అయితే, రైల్వే స్టేషన్లలో రిటైరింగ్ రూమ్స్ మాత్రం ఇప్పటి వరకు ఏసీ టికెట్ రిజర్వ్ చేయించుకున్న వారికి..కొందరికి మాత్రమే అందబాటులో ఉండేవి. కానీ, ఇప్పుడు రిటైరింగ్ రూమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. విశాలమైన విశ్రాంతి గదులు, డార్మిటరీలను ప్రయాణికుల కోసం కేటాయించారు. వేసవి పర్యటనల కోసం నగరానికి వచ్చే పర్యాటకులతో ఈ గదులకు అనూహ్యమైన డిమాండ్ ఉన్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
స్టార్‌హోటళ్లు, లాడ్జీల కంటే తక్కువ ధరలకే లభించడంతో డిమాండ్ నెలకొన్నట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ తో పాటుగా నాంపల్లి.. కాచిగూడ స్టేషన్లకు నిత్యం లక్షల సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తిరుపతి తదితర పుణ్య క్షేత్రాలకు వెళ్లేవారు తిరుగు ప్రయాణంలో సిటీటూర్‌కు ప్రాధాన్యతనిస్తున్నారు.
దీంతో ఇంటిల్లిపాదీ కలిసి పరిచయం లేని ప్రాంతాల్లో ఉండడం కంటే భద్రత దృష్ట్యా రైల్వేస్టేషన్‌లనే ఎంపిక చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో...రిటైరింగ్ రూమ్స్ పైన రైల్వే అధికారులు ఫోకస్ చేసారు. అందులో భాగంగా.. 24 నుంచి 48 గంటల వరకు బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండు, మూడు గంటల పాటు విశ్రాంతి కోసం కూడా గదులను తీసుకోవచ్చు.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పర్యటించవలసి వచ్చినప్పుడు రిటైరింగ్ రూమ్‌లను, డార్మిటరీలకు ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. విశ్రాంతి గదులను అద్దెకు తీసుకొనేందుకు ప్రయాణికులు నిర్ధారిత టికెట్‌ను కలిగి ఉండాలి. టికెట్ బుకింగ్ సమయంలోనే రిటైరింగ్ రూమ్ బుక్ చేసుకోవచ్చు. రైల్వేస్టేషన్‌కు చేరుకున్న తర్వాత కూడా బుకింగ్ సదుపాయం ఉంటుంది.
కానీ నిర్ధారిత టిక్కెట్ ఉండాలి. ప్రయాణ తేదీకి అనుగుణంగానే విశ్రాంతి గదుల సదుపాయం లభిస్తుంది. ఏసీ, నాన్ ఏసీ సదుపాయంతో కూడిన ఈ గదుల్లో పడకలు, స్నానాల గదులు, టీవీ, తాగునీరు వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. ఐఆర్‌టీసీ ఈ గదులను నిర్వహిస్తుంది. రైల్వేస్టేషన్‌లలో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ వంటి భద్రతా బలగాల పర్యవేక్షణ ఉంటుంది. ప్రయాణికులకు పూర్తి భద్రత ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications