నోట్ల రద్దు-తెలంగాణ ఆఫర్: ఉద్యోగులకు రూ.10వేల వంద నోట్ల పంపిణీ, కానీ

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రూ.10వేల నగదు పంపిణీ ప్రారంభమైంది. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్‌ నెల వేతనంలో నుంచి రూ.10వేల చొప్పున నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

నోట్ల రద్దు: ఏపీ ఉద్యోగులకు చేదు, తెలంగాణ ఉద్యోగులకు 'ఆర్బీఐ' శుభవార్త

అందుకు అనుగుణంగా గురువారం బ్యాంకుల్లో నగదు పంపిణీని ప్రారంభమైంది. నగదు తీసుకునేందుకు ఉద్యోగులు, ప్రభుత్వం ఫించనుదారులు ఉదయం నుంచే బ్యాంకుల వద్ద బారులు తీరారు. సచివాలయంలోని ఎస్బీహెచ్ శాఖ ఉద్యోగులకు రూ.10వేల నగదు ఇస్తోంది.

Secretariat SBP distributing rs 10,000 change to employees

అయితే నగదు కొరత కారణంగా ఆంధ్రా బ్యాంకు మాత్రం ఇవ్వడం లేదు. ఉద్యోగులకు టోకెన్లు ఇచ్చి పంపుతున్నారు. నగదు ఇచ్చేందుకు ఎస్బీహెచ్‌లో మూడు కౌంటర్లు ఏర్పాటు చేశారు.

ఉన్నంత వరకు పంచుతాం

ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.10వేల వరకు వంద నోట్ల రూపాయలను పంపిణీ చేస్తామని ఎస్బీహెచ్ బ్యాంకు అధికారులు చెప్పారు. తమ వద్ద ఉన్న నగదు మేరకు ఉద్యోగులకు పంపిణీ చేస్తామన్నారు. మరింత డబ్బు కావాలని ప్రధాన బ్యాంకుకు సమాచారం ఇచ్చామని తెలిపారు.

భద్రాద్రి హుండీ ఆదాయం పెరిగింది

భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం హుండీ ఆదాయం బుధవారం లెక్కించారు. దేవస్థానానికి హుండీ ద్వారా రూ.46,72,337 ఆదాయం వచ్చింది. 65 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి వచ్చింది. హుండీ ఆదాయ లెక్కింపును దేవస్థానం ఈవో రమేష్ బాబు, ఏఈవో శ్రవణ్ కుమార్, డీఈ రవీంద్రనాథ్ పర్యవేక్షించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Secretariat SBP distributing rs 10,000 change to employees.
Please Wait while comments are loading...