వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రకృతి అందాల వీక్షణం; సికింద్రాబాద్-పూణే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ విస్టాడోమ్ కోచ్ ప్రయాణం; ప్రత్యేకతలు ఇవే!!

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ రైల్వేలోని విస్టా డోమ్ కోచ్‌లకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ముంబై-గోవా మార్గంలో ఉన్న లోయలు, నదులు మరియు జలపాతాలను చూడడం కోసం, ముంబై-పూణే మార్గంలో పశ్చిమ కనుమల యొక్క అద్భుతమైన అందాలను వీక్షించడం కోసం , గ్లాస్ టాప్స్ మరియు విశాలమైన గ్లాస్ కిటికీలతో విస్టా డోమ్ కోచ్‌ లు చాలా అద్భుతమైన ఫీలింగ్ ను ప్రయాణికులకు కలిగిస్తున్నాయి. విస్టాడోమ్ కోచ్‌ల ప్రజాదరణను చూసి, ఇప్పుడు సెంట్రల్ రైల్వే యొక్క ఐదవ విస్టాడోమ్ కోచ్ పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది .

పాముకాటు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్.. సంవత్సరానికి ఎన్ని మరణాలంటే!!పాముకాటు మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ రిపోర్ట్.. సంవత్సరానికి ఎన్ని మరణాలంటే!!

 ప్రయాణికుల నుండి విస్టాడోమ్ కోచ్ లకు విశేషమైన ఆదరణ

ప్రయాణికుల నుండి విస్టాడోమ్ కోచ్ లకు విశేషమైన ఆదరణ

సెంట్రల్ రైల్వే చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- మడ్గావ్- చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ జనశతాబ్ది, ప్రగతి ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్వీన్, డెక్కన్ ఎక్స్‌ప్రెస్ యొక్క విస్టా డోమ్ కోచ్‌లలో ఏప్రిల్ నుండి జూలై 2022 వరకు రూ.3.99 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. విస్టాడోమ్ కోచ్‌లను మొదటిసారిగా 2018లో ముంబై-మడ్‌గావ్ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ప్రవేశపెట్టారు. ఈ కోచ్‌లకు ఉన్న అపారమైన ఆదరణ 26 జూన్ 2021 నుండి ముంబై-పూణె డెక్కన్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ కోచ్‌లను ప్రవేశపెట్టడానికి దారితీసింది.

 ఇప్పటివరకు 5 రైళ్ళలో విస్టాడోమ్ కోచ్ లు

ఇప్పటివరకు 5 రైళ్ళలో విస్టాడోమ్ కోచ్ లు


ప్రయాణికుల నుండి విపరీతమైన డిమాండ్ కారణంగా, సెంట్రల్ రైల్వే యొక్క మూడవ విస్టాడోమ్ కోచ్ ఆగస్టు 15, 2021 నుండి దక్కన్ క్వీన్‌ లో ప్రయాణికులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తోంది. మరియు నాల్గవ విస్టాడోమ్ కోచ్ 25 జూలై 2022న ప్రగతి ఎక్స్‌ప్రెస్‌కు జోడించబడింది. ఇప్పుడు, విస్టాడోమ్ కోచ్ పూణే - సికింద్రాబాద్ శతాబ్దికి జోడించబడింది. కరోనా మహమ్మారి సమయంలో రద్దు అయిన ఎక్స్ప్రెస్ రైలు, విస్టాడోమ్ కోచ్ అదనపు జోడింపుతో ఆగస్టు 10వ తేదీ నుండి పునః ప్రారంభించబడింది.

 పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చెయ్యండిలా

పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణం చెయ్యండిలా


పూణే - సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకులు ఉజ్ని బ్యాక్ వాటర్స్ మరియు భిగ్వాన్ సమీపంలోని ఆనకట్టను ఆనందిస్తారు. ఇది అనేక జలపాతాలకు మరియు వలస పక్షులకు ప్రసిద్ధి చెందింది, ఇది వికారాబాద్ సమీపంలోని అనంతగిరి కొండల గుండా ప్రయాణించేటప్పుడు అడవి యొక్క సుందరమైన అందాలను కూడా ఆస్వాదిస్తారు. దారి పొడుగునా ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణం చెయ్యటం నిజంగా ఒక అద్భుతమైన అనుభూతి.

విస్టాడోమ్ కోచ్ ల ప్రత్యేకతలు ఇవే

విస్టాడోమ్ కోచ్ ల ప్రత్యేకతలు ఇవే


ప్రత్యేకమైన విస్టాడోమ్ కోచ్‌లు, గ్లాస్ రూఫ్ టాప్ కలిగి ఉండటమే కాకుండా, వెడల్పైన గ్లాసు విండోలు, ఎల్ ఈ డి లైట్లు, రొటేటబుల్ సీట్లు మరియు పుష్‌బ్యాక్ కుర్చీలు, ఎలక్ట్రికల్‌గా నిర్వహించబడే ఆటోమేటిక్ స్లైడింగ్ కంపార్ట్‌మెంట్ డోర్స్, వైడ్ సైడ్ స్లైడింగ్ డోర్స్ వంటి అనేక అదనపు ఫీచర్లను కలిగి ఉన్నాయి. ప్రయాణికులు తమ కూర్చున్న చోట నుండి కదలకుండా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేలా ఈ కోచ్ ను ఏర్పాటు చేశారు. అంతేకాదు ఒక అద్భుతమైన లాంచ్ కూడా ఈ కోచ్ లో ఉంది.

 టికెట్ ధర కూడా తక్కువే... ప్రకృతి అందాలను చూసే ప్రయాణానికి రెడీ అవ్వండిక

టికెట్ ధర కూడా తక్కువే... ప్రకృతి అందాలను చూసే ప్రయాణానికి రెడీ అవ్వండిక


ఇక ఈ రైలులో ప్రయాణం చేస్తూ సికింద్రాబాద్ నుండి పూణే వరకు ఉన్న అందాలను వీక్షించాలి అని భావించే ప్రయాణికులకు విస్టాడోమ్ కోచ్ లో ప్రయాణం ఒక్కొక్కరికి 2110 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. సికింద్రాబాద్ నుండి పూణే వరకు ఉన్న అద్భుతమైన అందాలను రైలు నుండి వీక్షించడానికి శతాబ్ది ఎక్స్ప్రెస్ విస్టాడోమ్ కోచ్ లో బుక్ చేసుకుంటే ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంచక్కా ప్రయాణం చేయొచ్చు.

English summary
Secunderabad-Pune Shatabdi Express Vistadome Coach Journey attracts with Nature View. You will definitely book your journey if you know the special features of the Vistadome coach which has recently restarted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X