ఎవరికీ సాధ్యంకాని రికార్డు సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్

భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు అత్యాధునికత సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, తనను తాను మార్చుకుంటూ ముందుకు పయనిస్తోంది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల తరహాలో ఆధునికీకరిస్తున్నారు. అందులో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కూడా ఉంది. దేశవ్యాప్తంగా రైళ్లను నడుపుతున్న ఈ స్టేషన్ నుంచి ఏడాదికి రెండుకోట్ల మంది ప్రయాణికులు ప్రయాణిస్తారు.

థానే నుంచి 94 కోట్ల మంది
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సికింద్రాబాద్ స్టేషన్ ఆదాయం పరంగా నాలుగో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. మొదటి మూడు స్థానాల్లో న్యూఢిల్లీ, హౌరా, చెన్నై సెంట్రల్ నిలిచాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భారతీయ రైల్వేకు రూ.1276 కోట్లను సంపాదించిపెట్టింది. అలాగే ప్రయాణికుల పరంగా ముంబయిలోని థానే రైల్వేస్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 94 కోట్ల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణించారు. ప్రతిరోజు ఈ స్టేషన్ కిక్కిరిసి ఉంటుంది.

secunderabad railway station create new record in indian railway for highest income

భవిష్యత్తులో ఆదాయం పెరగనున్న విజయవాడ
దక్షిణ మధ్య రైల్వేలో ఎన్ఎస్ జీ 1 హోదా కలిగిన స్టేషన్లు రెండు ఉన్నాయి. అవి సికింద్రాబాద్, విజయవాడ. ఏడాదికి రూ.500 కోట్ల ఆదాయాన్ని దాటిన స్టేషన్లు ఈ జాబితాలో నిలుస్తాయి. దేశవ్యాప్తంగా ఈ హోదా కలిగిన స్టేషన్లు 28 ఉన్నాయి. భవిష్యత్తులో విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ఆదాయం పెరుగుతుందని దక్షిణ మధ్య రైల్వే అంచనా వేస్తోంది. దీనికి కారణం ఏపీ రాజధాని అమరావతి. అమరావతికి కొత్తగా రైల్వే లైను వేయడం, ఈ లైనును విజయవాడ, గుంటూరుకు అనుసంధానం చేస్తుండటంతో ప్రయాణికుల సంఖ్య పెరిగి మరింత ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+