తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్‌లో కోచ్‌లు రెట్టింపు

హైదరాబాద్: తెలుగు ప్రజలకు మరో మంచి వార్త ఇది. సికింద్రాబాద్-తిరుపతి నగరాల మధ్య సేవలందిస్తోన్న వందేభారత్(Vandebharat) ఎక్స్‌ప్రెస్ రైలుకు విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లతో నడుస్తోన్న ఈ సెమీ-హైస్పీడ్ రైలులో బోగీల సంఖ్యను పెంచాలన్న అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

తిరుమల భక్తులతో రైలులో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలులో బోగీలను రెట్టింపు చేసేందుకు కేంద్రం నిర్ణయించింది. రైలులో ప్రస్తుతం ఉన్న 8 కోచ్‌లను 16కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Secunderabad-Tirupati vande bharat express

కాగా, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో 120-130 శాతం మేర ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. చాలా మంది ప్రయాణికులు రిజర్వేషన్లు దొరక్క ఈ రైలులో వెళ్లాలనుకున్నా.. ప్రయాణించలేకపోతున్నారు. ఈ విషయంపై మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్‌ను పిలిచి తిరుపతి వందేభారత్ రైలులో బోగీల సంఖ్యను పెంచే విషయంపై ఆరా తీశారు.

ఈ క్రమంలోనే వందేభారత్ రైలుకు ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ దక్షిణమధ్య రై్ల్వే అధికారులు రైల్వే బోర్డుకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే కసరత్తులు ప్రారంభించిన రైల్వే బోర్డు తాజాగా, సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కోచ్‌లను రెట్టింపు చేసేందుకు అంగీకరించింది. దీంతో తిరుపతికి మరింత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే అవకాశం కలగనుంది. త్వరలోనే రెట్టింపు కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+