పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి షాకిచ్చిన కేసీఆర్ సర్కారు!

హైదరాబాద్: ఖమ్మం మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేసీఆర్ సర్కారు ఝలక్ ఇచ్చిం ది. ఇటీవల పలు సందర్భాల్లో సొంత పార్టీపైనే అసహనం వ్యక్తం చేసిన క్రమంలో కీలక నిర్ణయం తీసుకుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కేటాయించిన భద్రతను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పొంగులేటి సెక్యూరిటీ కుదింపు, ఎస్కార్ట్ వాహనం కట్

పొంగులేటి సెక్యూరిటీ కుదింపు, ఎస్కార్ట్ వాహనం కట్

పొంగులేటి భద్రత కోసం కేటాయించిన 3+3 భద్రతను 2+2కు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భద్రతతో పాటు పొంగులేటికి కేటాయించిన ఎస్కా ర్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ఖమ్మం లోని పొంగులేటి నివాసం వద్ద భద్రత విధులు నిర్వ హించే నలుగురు సిబ్బం దిని తొలగించింది. ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయానికి ఖమ్మం ఏఆర్ పోలీసు అధికారులు సమాచారం చేరవేశారు. కుదించిన భద్రత ప్రకారం వ్యక్తిగత భద్రత కోసం కేటాయించిన సెక్యూరిటీలో ఎవరిని ఉంచాలో తెలపాలని ఏఆర్ పోలీసులు కోరినట్లు తెలిసింది.

చర్చనీయాంశంగా పొంగులేటి సెక్యూరిటీ కట్ అంశం

చర్చనీయాంశంగా పొంగులేటి సెక్యూరిటీ కట్ అంశం

అయితే, అధికార పార్టీ నాయకుడికి ఒక్కసారిగా భద్రత కుదిస్తూప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019లో ప్రభుత్వం పొంగులేటికి భద్రత పెంచింది. నిఘావర్గాల నివేదిక ఆధారంగా పొంగులేటికి 3+3 భద్రత కల్పించింది. తాజాగా దాదాపు రెండున్నరేళ్ల తర్వా త మళ్లీ భద్రత తగ్గిస్తూగ్గి స్తూనిర్ణయం

తీసుకుంది. ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలే దీనికి కారణమని రాజకీయంగా చర్చ సాగుతోంది.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొం తకాలంగా బీఆర్ఎస్‌లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన తర్వా త.. అధికార పార్టీలో చేరారు పొంగులేటి. 2019లో అనూహ్యం గా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు పార్టీ అధిష్ఠానం టికెట్ ఇవ్వలేదు. దీంతో అప్పటి నుంచి పార్టీ అధినాయకత్వంతో దూరం పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే జనవరి 1న నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఖమ్మంలోని తన నివాసంలో కార్యకర్తలర్త ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లావ్యా ప్తంగా పొంగులేటి అభిమానాలు,కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భం గా పలువురు కార్యకర్తలు పార్టీలో తమ నేతకు తీవ్ర అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోవాలని నాయకులు, కార్యకర్తలు కోరారు.

బీఆర్ఎస్‌లో రెబల్ నేతగా పొంగులేటికి ముద్ర!

బీఆర్ఎస్‌లో రెబల్ నేతగా పొంగులేటికి ముద్ర!

ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశిం చి పొంగులేటి కీలక వ్యా ఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌లో చేరినప్పటి నుంచి 4 ఏళ్లుగా పార్టీలోర్టీ దక్కుతున్న గౌరవం ఏంటో అందరికీ తెలిసిందేనని అన్నారు. భవిష్యత్తులో దక్కే గౌరవం ఏంటన్న దానిపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఏది ఏమైనా తనతో పాటు ప్రజాప్రతినిధిగా అర్హతర్హ ఉన్న ముఖ్య అనుచరులు

అందరూ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరతారంటూ స్పస్టం చేశారు. అంతేగాక, సమయం వచ్చినప్పుడు అభిమానులు, కార్యకర్తలుర్త కోరుకునేది తప్పక చేసి చూపిస్తానని అన్నారు. దీంతో పొంగులేటి చేసిన వ్యా ఖ్యల్ని జిల్లా పార్టీకి చెందిన కొం తమంది నేతలు అధిష్ఠానందృష్టికిష్టి తీసుకెళ్లిట్లు తెలిసింది. పొంగులేటి వ్యా ఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ అధిష్ఠానం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, సర్కారు తాజా నిర్ణయంపై పొంగులేటి స్పందించాల్సి ఉంది. ఆయన ఏ విధంగా స్పందిస్తారనేదానిపై ప్రాధాన్యత నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+