భద్రాద్రి, వేములవాడలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం, హైదరాబాద్లో కన్నులపండుగగా శోభాయాత్ర

శ్రీరామనవమి వేడుకలను తెలుగు రాష్ట్రాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో కన్నులపండువగా జానకీ రాముల కళ్యాణం జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన స్వామి వారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఘనంగా భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుకలు
భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీఎస్ శాంతకుమారి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి జానకీరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు, అన్న ప్రసాదం అందజేశారు.

Seetharama Kalyanam in Bhadradri and Vemulawada srirama navami Shobha Yatra in Hyderabad

వేములవాడలో ఘనంగా సీతారామ కళ్యాణం
శ్రీ రామనవమి సందర్బంగా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే భద్రాద్రి తరువాత వేములవాడలో అత్యంత ఘనంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రీరామనవమి పండుగ సందర్భంగా సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు.

సీతారామ్‌బాగ్‌ ఆలయం నుంచి ప్రారంభమైన శోభా యాత్ర
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ సీతారామ్‌బాగ్‌ ఆలయం నుంచి ఈరోజ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే శ్రీరామనవమి శోభాయాత్ర ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభించారు . భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఈ శోభాయాత్ర కోఠి హనుమాన్‌ టేక్డీ వరకు కొనసాగుతుంది.

శ్రీరామ నవమి సందర్భంగా మూడు యాత్రలు
ఆనంద్‌సింగ్‌ ఆధ్వర్యంలో ధూల్‌పేట మాగ్రా నుంచి ప్రారంభమయ్యే శ్రీరామ నవమి పాల్కీ యాత్రను మధ్యాహ్నం 12 గంటలకు బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు . మరో వైపు గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంటకు మరో శోభా యాత్ర ప్రారంభం అయ్యింది. ఈయాత్ర ధూల్‌పేట గంగాబౌలి నుంచి కోఠి హనుమాన్‌ టెక్డీ వరకు సాగుతుంది.

మూడు యాత్రలు కలిసి శోభాయాత్రగా
ఈ మూడు యాత్రలు మంగళ్‌హాట్‌ ప్రధాన రోడ్డులోని అనిత టవర్‌ వద్ద కలుస్తాయి. ఈ నేపథ్యంలో శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో వాహనాలను ఇతర ప్రాంతాల మీదుగా పోలీసులు దారి మళ్లిస్తున్నారు.శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఏటా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే శోభాయాత్ర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా కొనసాగుతుంది.

శోభాయాత్ర మార్గంలో పోలీసుల ఆంక్షలు
ప్రధాన యాత్ర సీతారాం బాగ్ ఆలయంనుంచి హనుమాన్ వ్యాయామ శాల దిశగా కొనసాగుతుంది. పలు చోట్ల ఇతర యాత్రలను కలుపుకుంటూ, ప్రధాన యాత్ర ముందుకు సాగుతోంది. మల్లేపల్లి, అఘాపూరా, భోయిగూడా, పురానాపూల్, జుమ్మెరాత్ బజార్, ధూల్ పేట్, అఫ్జల్ గంజ్ జంక్షన్, పుత్లిబౌలి వంటి ప్రాంతాల ద్వారా యాత్ర కొనసాగుతుంది. కాగా శోభా యాత్ర మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలపై పలు నిబంధనలు విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+