Congress: లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. సీనియర్ నేత సస్పెన్షన్..
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ సీనియర్ నేత బక్క జడ్సన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ లైన్ దాడి మాట్లడాడమే కాకుండా.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు సస్పెండ్ చేసినట్లు టీ-కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి మంగళవారం ప్రకటించారు. బహిరంగ వేదికలపై పార్టీ లైన్ క్రాస్ చేసి మాట్లాడటం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో బక్క జడ్సన్‌ను సస్పెండ్ చేసినట్లు వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగ వేదికలపై పలుమార్లు బక్క జడ్సన్ విమర్శలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ డిసిప్లేనరీ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జడన్స్ నోటీసులకు వివరణ ఇచ్చినప్పటికీ ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే బక్క జడ్సన్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేశారు. ఎన్నో అవినీతి విషయాలను బయటకు తీసుకొచ్చారు. పేద ప్రజల తరఫున పోరాటం చేశారు.

నడవలేని స్థితిలో ఉన్నా.. ముందుండి పోరాటం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజల్లో ఎండగట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ అన్యాయం జరిగితే ప్రశ్నించాడు. బాధితులకు అండగా నిలిచాడు. బక్క జడ్సన్ కు సస్పెండ్ చేసేది కాకుండే అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మరో అవకాశం ఇస్తే అయిపోయేదని చెప్పుకుంటున్నారు. జడ్సన్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.
పార్టీ మారుతారా లేక సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఎదురు చూస్తారా చూడాలి. గతంలో లాగా ప్రభుత్వం పోరాటే చేసినట్లు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటే చేస్తారా అనేది చూడాలి. ఎన్నికల వేళ జడ్సన్ సస్పెన్షన్ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇచ్చింది. షోకాజ్ నోటీసులకు బక్క జడ్సన్ రిప్లై ఇచ్చినప్పటికీ.. ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కమిటీ.. తాజాగా బక్క జడ్సన్‌ను ఆరేండ్ల పాటు పార్టీ నుండి సస్పెండ్ చేసింది.












Click it and Unblock the Notifications