ఇతర పార్టీల సీనియర్లంతా మాతో టచ్‌‌లో, సంక్రాంతి తర్వాత కొత్త పీసీసీ కమిటీ: ఉత్తమ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: వివిధ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయని ఆయన చెప్పారు.

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ జాతీయ నాయత్వం మరోసారి అవకాశం ఉత్తమ్ కుమార్ రెడ్డికి కల్పించింది. అయితే ఎన్నికల వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొనసాగే అవకాశం ఉంది.

నేను వైఎస్ అభిమానిని, ఆత్మగౌరవయాత్ర చేస్తా: మల్లు భట్టి విక్రమార్క

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం నాడు మీడియాతో చిట్ చాట్ చేశారు.రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించే వ్యూహన్ని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేందుకు అన్ని రకాల వ్యూహలను అనుసరిస్తున్నట్టు చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు చేరుతారు

కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకులు చేరుతారు


కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే వివిధ పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు చేరుతారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.అయితే ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే విషయాన్ని మాత్రం ఉత్తమ్ చెప్పలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్న నేతలతో చర్చలు సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. త్వరలోనే అన్ని విషయాలను ప్రకటించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

సంక్రాంతి తర్వాత పీసీసీ కొత్త కమిటీ

సంక్రాంతి తర్వాత పీసీసీ కొత్త కమిటీ

సంక్రాంతి పర్వదినం తర్వాత పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించనున్నట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే కొత్త పీసీసీ కార్యకవర్గం 2019 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఎన్నికల అవసరాలను దృష్టిలో ఉంచుకొనే ఈ కమిటీలో నేతలకు ప్రాతినిథ్యం కల్పించనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రం నుండి ఎఐసిసిలో ప్రాతినిథ్యం

రాష్ట్రం నుండి ఎఐసిసిలో ప్రాతినిథ్యం

రాష్ట్రం నుండి ఎఐసిసిలో కూడ ప్రాతినిథ్యం ఉంటుందని పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అయితే ఎఐసిసిలో ఎవరెవరికీ ప్రాతినిథ్యం కల్పిస్తారనే విషయాన్ని మాత్రం ఆయన ప్రకటించలేదు. రేవంత్ రెడ్డితో పాటు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు పీసీసీ కార్యవర్గంతో పాటు ఎఐసిసిలో కొందరికి చోటు కల్పించే అవకాశం దక్కనుంది.

2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వస్తోందని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.ఈ మేరకు తాము అన్ని రకాలుగా పార్టీని బలోపేతం చేసుకొంటున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విదానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయనున్నట్టు చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును పెడితే అప్పుడు స్పందిస్తామని ఆయన చెప్పారు.

మేడారం జాతరకు రాహుల్

మేడారం జాతరకు రాహుల్

త్వరలో జరిగే మేడారం జాతరకు రాహుల్ గాంధీని ఆహ్వనిస్తున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ జాతరకు ఆయన వచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాహుల్ తో ఎక్కువ సభలను నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని ఆయన చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Top most senior leaders likely to join in congress party said TPcc dhief Uttamkumar Reddy. Uttamkumar Reddy was chit chat with media on Monday at Hyderabad

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి