phone tapping caseలో సంచలనం: మాస్టర్ మైండ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న వేళ మరోమారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కలకలం మొదలైంది. ఈ కేసులో తాజాగా సంచలన పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తో పాటు, ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ ల పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు.
ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ కు రెడ్ కార్నర్ నోటీసులు
నేడు ప్రభాకర్ రావు తో పాటు శ్రవణ్ కుమార్ కు నాంపల్లి కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేయడంతో పంజాగుట్ట పోలీసులు సిఐడి, సిబిఐ దర్యాప్తు సంస్థల ద్వారా అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్ కు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. ఈ క్రమంలో సిఆర్ పి సి సెక్షన్ 73 కింద నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసులో మాస్టర్ మైండ్ ఆయనదే
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడని పేర్కొన్న పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టు అయిన పోలీస్ అధికారుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఆయనదేనని పేర్కొన్నారు. రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు ఇలా అందరి వెనుక ఆయనే ఉన్నారంటూ పేర్కొనడంతోపాటు, ఎస్ఐబి కార్యాలయంలో ఆధారాలు, సాక్షాలను ధ్వంసం చేసి మాయం చేశారని కోర్టుకు తెలిపారు.
ఆధారాలు, సాక్ష్యాలను ధ్వంసం చేయటంతో నష్టం
ఈ మొత్తం కేసుకు సంబంధించి చెప్పిన విషయాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్ల రాష్ట్ర భద్రతకు తీవ్ర విఘాతం కలిగిందని, వ్యక్తిగత భద్రత కూడా పోయిందన్నారు. ఆధారాలు, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వల్ల దశాబ్దాలు తరబడి సేకరించిన మావోయిస్టులు, అసాంఘిక శక్తుల సమాచారం మొత్తం నాశనమైందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రభాకర్ రావు దీనిపై చెప్తుందిదే
ఇదిలా ఉంటే ఈ కేసులో మొదటి నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు మాత్రం రెడ్ కార్నర్ నోటీసు జారీ పై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి తన వాదన వినిపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, అప్పటి డీజీపీలు, ఇంటిలిజెన్స్ చీఫ్ ల పర్యవేక్షణలోనే పని చేశానని, వారి ఆదేశానుసారమే తను పనిచేశాను అన్నారు. అంతేకాదు తన ఆరోగ్యం బాగోక క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని, ప్రస్తుతం చికిత్స జరుగుతుందని చికిత్స పూర్తయిన తర్వాత హైదరాబాద్ వస్తానని, విచారణ అధికారులకు సహకరిస్తా అన్నారు ప్రభాకర్ రావు.












Click it and Unblock the Notifications