TSPSC Paper Leak: ఏఈ పేపర్ లీక్ కేసులో వెలుగులోకి సంచలన వాస్తవాలు..!

టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో సంచలన నిజాలు బయటకొస్తున్నాయి.

టీఎస్‍పీఎస్సీ ఏఈ పేపర్ లీక్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అయితే తాజాగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడంతో ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రవీణ్ కుమార్ అధికారులు సస్పెండ్ చేయగా.. మరో ఔటసోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించారు.

ఎన్ఎస్‍యూఐ

కాగా ఈ కేసుకు సంబంధించి నిందితులను కఠినంగా శిక్షంచాలంటూ ఎన్ఎస్‍యూఐ టీఎస్‍పీఎస్సీ ముట్టడికి ప్రయత్నించింది. పోలీసులు వారిని అడ్డుకుని స్టేషన్ కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్‌ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్‌ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్‌ డాక్యాకు అందించాడు.

హరిశ్చందర్ రావు

హరిశ్చందర్ రావు

ఉమ్మడి ఏపీలో హరిశ్చందర్ రావు డీజీపీ ఆఫీస్ లో పని చేస్తుండేవాడు. ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమారుడు ప్రవీణ్ కుమార్ కు జూనియర్ అసిస్టెంట్ గా నియమించారు. ప్రవీణ్ కుమార్ టీఎస్‍పీఎస్సీలో 2017 నుంచి పని చేస్తున్నాడు. మరో నిందితురాలు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేణుక గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా పని చేస్తున్నారు. ఈమె 2018 టీఎస్ పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.

డీఆర్డీఏ

డీఆర్డీఏ

ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్ లో డీఆర్డీఏలో పని చేస్తున్నారు. టీఎస్ పీఎస్సీ పరీక్ష సిద్ధమవుతున్న రేణుకు ప్రవీణ్ పరిచయం అయ్యాడు. ఆమె రెగ్యులర్ గా టీఎస్‍పీఎస్సీ కార్యాలయానికి వచ్చేది. ఈ క్రమంలోనే రేణుక, డాక్యా పేపర్ లీక్ చేయాలని ప్లాన్ వేశారు. రేణుక ప్రవీణ్ ను పేపర్ లీక్ చేస్తే డబ్బులిస్తామని చెప్పడంతో అందుకు ప్రవీణ్ ఓకే చెప్పాడు. ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్ వర్క్ అడ్మిన్ గా పని చేస్తున్న రాజశేఖర్ తో పేపర్ లీక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

కాన్ఫిడెన్షియల్ రూమ్

కాన్ఫిడెన్షియల్ రూమ్

అయితే పరీక్ష పేర్లన్నీ కాన్ఫిడెన్షియల్ రూమ్ లోని ఓ కంప్యూటర్లో ఉంటాయి. కంప్యూటర్ నుంచి పేపర్ లీక్ చేయాలంటే పాస్ వర్డ్, యూసర్ ఐడీ కావాలి. ఈ సెక్షన్ కు శంకరలక్ష్మి ఇన్ చార్జిగా వ్యవహారిస్తున్నారు. ఆమె యూసర్ ఐడీ, పాస్ వర్డ్ ఓక బుక్ చివర రాసుకున్నారు. ఇది గమనించిన ప్రవీణ్ బుక్ చివర ఉన్న యూసర్ ఐడీ, పాస్ వర్డ్ ఫొటో తీసుకున్నట్లు తెలిసింది.

పెన్ డ్రైవ్

పెన్ డ్రైవ్

ఆ తర్వాత ప్రవీణ్, రాజశేఖర్ కాన్ఫిడెన్షయల్ రూమ్ లో కి వెళ్లి ఏఈ పరీక్షకు సంబంధించి జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లు, టౌన్ ప్లానింగ్ పరీక్ష పేపర్లను తమ పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకున్నారు. వాటిని ప్రింట్ కూడా తీసుకున్నారు. రేణుక, డాక్యాకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రవీణ్ కు కొంత డబ్బు చెల్లించి పేపర్లు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు చేశారు.

కేతావత్‌ శ్రీనివాస్‌

కేతావత్‌ శ్రీనివాస్‌

ఈ క్రమంలో రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్‌ కుమారుడైన కేతావత్‌ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్‌ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్‌ శ్రీనివాస్‌ సంప్రదించారు. కానీ శ్రీనివాస్ తాను ఎస్సైకి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్పాడు. అయితే తనకు తెలిసిన నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్ కు చెప్పాడు.

రేణుక, డాక్యా

రేణుక, డాక్యా

వారు పేపర్లు కొనడానికి సిద్ధంగా ఉండడంతో రేణుక, డాక్యాతో రూ.13. 5 లక్షలకు బేరం మాట్లాడుకున్నారు. అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. వారిద్దరితో పాటు రాజంద్ర నాయక్ ను మహబూబ్ నగర్ గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకెళ్ల డాక్యా. మార్చి 5న డాక్యా అభ్యర్థులను తీసుకుని సరూర్ నగర్ లోని పరీక్ష కేంద్రంల పరీక్ష రాయించిన అనంతరం వెళ్లిపోయాడు. 6న మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, డాక్యా మరో రూ.5 లక్షలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+